బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Mar 04, 2020 , 19:26:47

బీజేపీకి ప్రతీసారి ఓటమే..కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజారిటీ

బీజేపీకి ప్రతీసారి ఓటమే..కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజారిటీ

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి స్పష్టమైన మెజారిటీ ఉందని ఆ రాష్ట్ర సీఎం కమల్‌నాథ్‌ చెప్పారు. ఇవాళ సీఎం కమల్‌నాథ్‌ మీడియాతో మాట్లాడుతూ..బీజేపీ ప్రతీసారి పరాజయం పాలవుతుంది. ఈ సారి విఫలమవుతుంది. బీజేపీ వేస్తోన్న ప్రణాళిక ఎంతో ప్రాచుర్యం పొందిన ముంగేరిలాల్‌ సీరియల్‌లోని పాత్రలా నిలిచిపోవడం ఖాయమని సీఎం కమల్‌నాథ్‌ ఎద్దేవా చేశారు. బీజేపీ అప్రజాస్వామిక పద్దతిలో రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కుట్రపన్నుతోందని మండిపడ్డారు. బీజేపీ డబ్బు, అధికారంతో మధ్యప్రదేశ్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ప్రయత్నాలు చేస్తోందని పలువురు కాంగ్రెస్‌ నేతలు ఆరోపించిన నేపథ్యంలో..సీఎం కమల్‌నాథ్‌ పైవిధంగా స్పందించారు. 


logo