శుక్రవారం 22 జనవరి 2021
National - Dec 03, 2020 , 21:18:08

సవరణలు కాదు.. అగ్రి చట్టాలను వెనక్కి తీసుకోవాలి: రైతు నేతలు

సవరణలు కాదు.. అగ్రి చట్టాలను వెనక్కి తీసుకోవాలి: రైతు నేతలు

న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు సవరణలను తాము కోరడం లేదని, వాటిని పూర్తిగా వెనక్కి తీసుకోవాలని మాత్రమే డిమాండ్‌ చేస్తున్నామని రైతు సంఘాల నేతలు, ప్రతినిధులు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వంతో గురువారం జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిసిన అనంతరం మీడియాతో వారు మాట్లాడారు. చర్చల వల్ల ఎలాంటి పురోగతి లేదని ఆజాద్‌ కిసాన్‌ సంఘర్ష్‌ కమిటీకి చెందిన హర్జిందర్‌ సింగ్‌ తెలిపారు. ఇవాళ్టి చర్చల వల్ల ఎలాంటి ఫలితం ఉండదని చర్చల సగంలోనే తెలిసిపోయిందన్నారు. రైతుల ఆందోళనపై ప్రభుత్వంపై ఒత్తిడి ఉన్నదని విరామం అనంతరం జరిగిన చర్చల ద్వారా తెలిసిందన్నారు. ప్రభుత్వం తప్పని సరిగా వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందేనన్న ఆయన తదుపరి సమావేశంలో దీనిపై స్పష్టత రావచ్చని అన్నారు. కాగా, చట్టాలను వెనక్కి తీసుకోవాలని రైతులు కోరుతుంటే, సవరణలు, కనీస మద్దతు ధర గురించి మాత్రమే ప్రభుత్వం మాట్లాడుతున్నదని భారతీయ కిసాన్‌ యూనియన్‌ ప్రతినిధి రాకేశ్‌ తికైత్‌ విమర్శించారు. చట్టాలను పూర్తిగా వెనక్కి తీసుకుంటేనే తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలం­గాణ ఆండ్రా­యిడ్ యాప్ డౌన్‌­లోడ్ చేసు­కోండి


logo