మంగళవారం 26 మే 2020
National - May 18, 2020 , 17:18:14

కర్ప్యూ అనే పదం మాకు నచ్చదు: బెంగాల్‌ సీఎం

కర్ప్యూ అనే పదం మాకు నచ్చదు: బెంగాల్‌ సీఎం

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో లాక్‌డౌన్‌ను మే 31 వరకు పొడిగిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీ తెలిపారు. అయితే, మేం లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నామే తప్ప కర్ప్యూ విధించడం లేదని, నిజానికి కర్ప్యూ అనే పదం తమకు నచ్చదని ఆమె చెప్పారు. కాగా, నాలుగో విడత లాక్‌డౌన్‌లో పలు ఆంక్షల నుంచి బెంగాల్‌ ప్రభుత్వం సడలింపులు ఇచ్చింది. తాజా మినహాయింపుల ప్రకారం.. 50 శాతం మంది సిబ్బందితో షాపింగ్‌ మాల్స్‌లో ఉన్న ప్రైవేటు కార్యాలయాలను ఆల్టర్‌నేట్‌ డేస్‌లో తెరుచుకోవచ్చు. హెయిర్‌ కటింగ్‌ సెలూన్‌లను పునఃప్రారంభించవచ్చు. అయితే సెలూన్‌లలోని పరికరాలను ప్రతి ఆరుగురు కస్టమర్లకు ఉపయోగించిన తర్వాత ఒకసారి డిస్‌ఇన్‌ఫెక్ట్‌ చేయాలి. కచ్చితమైన భౌతిక దూరం పాటిస్తూ హోటళ్లను తెరుచుకోవచ్చు. అదేవిధంగా అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు బెంగాల్‌ ప్రభుత్వం అనుమతించింది. ప్రేక్షకులు లేకుండా ఆటలు ఆడుకునేందుకు పర్మిషన్‌ ఇచ్చింది. 


logo