మంగళవారం 20 అక్టోబర్ 2020
National - Sep 25, 2020 , 19:40:19

సుశాంత్‌ కేసు దర్యాప్తు ఏ దిశలో సాగుతుందో తెలియడం లేదు..

సుశాంత్‌ కేసు దర్యాప్తు ఏ దిశలో సాగుతుందో తెలియడం లేదు..

పాట్నా: బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం కేసు దర్యాప్తు ఏ దిశలో సాగుతున్నదో తెలియడం లేదని, తాము  నిస్సహాయంగా ఉన్నామని సుశాంత్‌ తండ్రి తరుఫు న్యాయవాది వికాస్‌ సింగ్‌ తెలిపారు. దర్యాప్తులో ఏం తెలిసిందన్న దానిపై సీబీఐ ఇప్పటి వరకు మీడియా సమావేశం నిర్వహించలేదని, ఏ విషయాలు చెప్పలేదని ఆయన అన్నారు. సీబీఐ దర్యాప్తు వేగంపై తాను అసంతృప్తితో ఉన్నట్లుగా వికాస్‌ సింగ్‌ చెప్పారు. సుశాంత్‌ మరణం కేసు దర్యాప్తు వేరే దిశకు మళ్లినట్లు కుటుంబ సభ్యులు భావిస్తున్నరని ఆయన తెలిపారు. ప్రస్తుతం దృష్టంతా డ్రగ్స్‌ వైపు మళ్లిందని అన్నారు. గొంతు నులమడం వల్ల సుశాంత్‌ మరణించినట్లుగా ఢిల్లీ ఎయిమ్స్‌ డాక్టర్‌ తనకు చెప్పారని తండ్రి తరఫు న్యాయవాది వికాస్‌ సింగ్‌ వెల్లడించారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలం­గాణ ఆండ్రా­యిడ్ యాప్ డౌన్‌­లోడ్ చేసు­కోండి


logo