మంగళవారం 01 డిసెంబర్ 2020
National - Oct 28, 2020 , 15:19:48

అబద్ధాల్లో.. మోదీతో పోటీ పడలేం: రాహుల్‌

అబద్ధాల్లో..  మోదీతో పోటీ పడలేం: రాహుల్‌

పాట్నా: తమకు అబద్ధాలు చెప్పడం రాదని, అందుకే ఈ విషయంలో ప్రధాని మోదీతో పోటీ పడలేమని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అన్నారు. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా వాల్మీకినగర్‌ ప్రచార సభలో ఆయన మాట్లాడారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని  ప్రధాని తన ప్రసంగంలో చెప్పడం లేదని రాహుల్‌ మండిపడ్డారు. తాను అబద్ధాలు చెబుతున్న సంగతి ఆయనతోపాటు ప్రజలకు కూడా తెలుసని విమర్శించారు. ప్రధాని ఇక్కడకు వచ్చి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని అంటే జనం ఆయనను గ్యారంటీగా తరిమికొడతారని అన్నారు. ఈ దేశానికి కాంగ్రెస్‌ మార్గనిర్దేశం చేసిందని రాహుల్‌ తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టామని, రైతుల రుణాలను మాఫీ చేశామని చెప్పారు. ఉద్యోగ కల్పనతోపాటు రైతులకు మద్దతుగా ఉంటూ దేశాన్ని ఎలా పరిపాలించాలో అన్నది కాంగ్రెస్‌ పార్టీకి తెలుసని రాహుల్‌ గాంధీ అన్నారు. అయితే అబద్ధాలు చెప్పడంలో మాత్రమే తాము వెనక ఉన్నామంటూ ఎద్దేవా చేశారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.