సోమవారం 06 జూలై 2020
National - May 03, 2020 , 12:56:13

జ‌ర్న‌లిస్టుల సేవ‌లు మ‌రువ‌లేనివి: ఉప రాష్ట్ర‌ప‌తి

జ‌ర్న‌లిస్టుల సేవ‌లు మ‌రువ‌లేనివి: ఉప రాష్ట్ర‌ప‌తి

న్యూఢిల్లీ: ప్రపంచ పత్రికాస్వేచ్ఛ‌ దినోత్సవం సందర్భంగా జర్నలిస్టులందరికీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. నిజం, నిష్పాక్షికత, కచ్చితత్వం, జవాబుదారీతనం, న్యాయబద్ధత, నైతికత, ప్రజాస్వామ్య పరిరక్షణ వంటి మూలసూత్రాలకు మీడియా కట్టుబడి ఉండాలని ఆయ‌న‌ ట్వీట్ చేశారు. రాజ్యాంగంలోని 19వ అధికరణం ద్వారా సంక్రమించిన భావప్రకటనా స్వేచ్ఛను సద్వినియోగం చేసుకుంటూ.. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా, ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలుగా పత్రికలు, జర్నలిస్టులు పోషిస్తున్న పాత్రను మరువ‌లేమ‌ని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. 

వార్తలకు స్వీయ అభిప్రాయాలను జోడించకుండా యధాతథంగా అందించాలని సూచించారు. కరోనాపై యుద్ధంలో జర్నలిస్టులు ముందువరసలో ఉండి పోరాటం చేస్తుండ‌టం అభినందనీయమన్నారు. ప్రజాసంక్షేమంతోపాటు దేశాభివృద్ధికి మీడియా తోడ్ప‌డాల‌ని ఆయ‌న కోరారు. ముఖ్యంగా వ్యవసాయం, గ్రామీణాభివృద్ధిపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించారు. 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo