బుధవారం 02 డిసెంబర్ 2020
National - Jun 01, 2020 , 16:48:53

అంత‌ర్రాష్ట్ర ర‌వాణాకు అనుమ‌తించం: గోవా సీఎం

అంత‌ర్రాష్ట్ర ర‌వాణాకు అనుమ‌తించం: గోవా సీఎం

ప‌నాజి: ‌కేంద్ర ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల్లో పేర్కొన్న‌ట్లుగానే త‌మ రాష్ట్రంలో తాజా లాక్‌డౌన్ స‌డలింపుల‌న్నీ వ‌ర్తింప‌జేస్తామ‌ని, అయితే అంత‌ర్రాష్ట్ర ర‌వాణాకు మాత్రం ఇప్ప‌ట్లో అనుమ‌తించ‌బోమ‌ని గోవా ముఖ్య‌మంత్రి ప్ర‌మోద్ సావంత్ తెలిపారు. 'కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన అన్ని స‌డ‌లింపులను రాష్ట్రంలో కూడా అమ‌లు చేస్తాం. అంత‌ర్రాష్ట్ర ర‌వాణాకు మాత్రం ఇప్పుడ‌ప్పుడే అనుమ‌తించం' అని గోవాం సీఎం చెప్పారు. 

కేంద్ర హోంశాఖ లాక్‌డౌన్ స‌డ‌లింపుల‌కు సంబంధించి ఆదివారం మార్గద‌ర్శ‌కాలు జారీచేసింది. అంత‌ర్రాష్ట్ర ర‌వాణాకు సంబంధించి ఇక‌పై ఎలాంటి ప‌ర్మిష‌న్‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆ మార్గ‌ద‌ర్శ‌కాల్లో పేర్కొన్న‌ది. అయితే, దీనిపై త‌మ రాష్ట్రంలో ప‌రిస్థితుల మేర‌కు నిర్ణ‌యం తీసుకునే అధికారం రాష్ట్రాల‌కు ఉంద‌ని తెలిపింది. ఈ నేప‌థ్యంలో గోవా సీఎం తాజా నిర్ణ‌యం తీసుకున్నారు.     ‌ ‌