గురువారం 09 ఏప్రిల్ 2020
National - Mar 08, 2020 , 21:44:12

ప్రతీసారి త్యాగం చేయలేం కదా..

ప్రతీసారి త్యాగం చేయలేం కదా..

బిహార్‌: ప్రతీసారి త్యాగం చేయలేమనీ రాష్ట్రీయ జనతా దళ్‌(ఆర్జేడీ) ఎమ్మెల్యే భాయ్‌ వీరేంద్ర అన్నారు. ఏప్రిల్‌లో బిహార్‌ నుంచి ఇద్దరు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియనున్నదనీ.. ఆర్జేడీ పార్టీ నుంచి ఇద్దరు నాయకుల పేర్లను రాజ్యసభకు ఎంపిక చేసేందుకు ఎలక్షన్‌ కమిషన్‌కు పంపినట్లు ఆయన వెల్లడించారు. కాంగ్రెస్‌ కూడా ఆర్జేడీకి మద్దతు ఇస్తున్నదని ఆయన మీడియాతో అన్నారు. పోయినసారి మేము(ఆర్జేడీ) కాంగ్రెస్‌కు ఒక రాజ్యసభ సీటుకు మద్దతిచ్చామని తెలిపిన వీరేంద్ర.. ప్రతిసారి త్యాగం చేయలేమన్నారు.


logo