శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
National - Jan 27, 2021 , 18:13:51

ఆందోళ‌న నుంచి వైదొలుగుతున్నాం: RKMS, Bhanu

ఆందోళ‌న నుంచి వైదొలుగుతున్నాం: RKMS, Bhanu

న్యూఢిల్లీ: రైతుల ట్రాక్ట‌ర్ ర్యాలీ సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం ఢిల్లీలో చోటుచేసుకున్న హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో నూత‌న వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా జ‌రుగుతున్న ఉద్య‌మంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ర్యాలీలో హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల కార‌ణంగా తాము రైతు ఆందోళనల నుంచి వైదొలుగుతున్నామ‌ని రెండు రైతు సంఘాలు ప్రకటించాయి.  ఈ మేర‌కు రాష్ట్రీయ కిసాన్‌ మజ్దూర్‌ సంఘటన్‌ (RKMS‌) కన్వీనర్‌ సర్దార్‌ వీఎం సింగ్‌, భారతీయ కిసాన్‌ యూనియన్‌ (Bhanu) అధ్య‌క్షుడు ఠాకూర్ భాను ప్ర‌తాప్‌సింగ్ మీడియా ముఖంగా ప్ర‌క‌ట‌న‌లు చేశారు. 

నిన్న ఢిల్లీలో జరిగిన ఘటనలు త‌మ‌ను బాధించాయని, ఇతరుల ఆధ్వర్యంలో తాము ఆందోళ‌న కొనసాగించలేమని వారు ప్ర‌క‌టించారు. కొన్ని రైతు సంఘాలు ఇతరులు చెప్పినట్టు పనిచేస్తున్నాయని వీఎం సింగ్‌ ఆరోపించారు. రాకేశ్‌ తికాయత్‌ వంటి నేతల వైఖరితోనే ట్రాక్ట‌ర్ ర్యాలీలో ఉద్రిక్తత నెలకొందన్నారు. ర్యాలీని ఇతర మార్గాల్లో తీసుకెళ్లాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింద‌ని, ఎర్రకోటపై జెండా ఎగురవేసి ఏం సాధించామని వీఎం సింగ్ ప్రశ్నించారు. అయితే, రైతుల‌ హక్కుల కోసం, మద్దతు ధర సాధన కోసం తమ పోరాటం కొనసాగుతుందని వారు స్పష్టంచేశారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo