శుక్రవారం 27 నవంబర్ 2020
National - Nov 04, 2020 , 12:39:51

ఢిల్లీలో క‌రోనా థ‌ర్డ్ వేవ్‌: కేజ్రివాల్

ఢిల్లీలో క‌రోనా థ‌ర్డ్ వేవ్‌: కేజ్రివాల్

న్యూఢిల్లీ: దేశ రాజ‌ధాని ఢిల్లీలో క‌రోనా పాజిటివ్ కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి. కొత్త‌గా న‌మోద‌య్యే కేసుల సంఖ్య గ‌త కొంత కాలంగా త‌గ్గుతూ వ‌చ్చిన‌ప్ప‌టికీ.. ఇటీవ‌ల మ‌ళ్లీ పెద్ద సంఖ్య‌లో కొత్త కేసులు న‌మోదవుతున్నాయి. తాజాగా ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రివాల్ కూడా ఢిల్లీలో కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న‌ద‌ని చెప్పారు. కొవిడ్‌-19 కేసుల విస్త‌ర‌ణ‌లో దీన్ని థ‌ర్డ్ వేవ్‌గా చెప్ప‌వ‌చ్చ‌ని ఆయన పేర్కొన్నారు. 

కేసుల సంఖ్య పెరుగుతుండంతో ఢిల్లీ అధికార యంత్రాంగం అప్ర‌మ‌త్త‌మైంద‌ని ముఖ్య‌మంత్రి కేజ్రివాల్ తెలిపారు. ప‌రిస్థితిని తాము ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షిస్తున్నామ‌ని చెప్పారు. మునుప‌టిలా కొత్త కేసులు విజృంభించ‌కుండా అవ‌స‌ర‌మైన‌ అన్ని చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు.   ‌

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.