మంగళవారం 19 జనవరి 2021
National - Dec 18, 2020 , 18:11:37

మత సామరస్యాన్ని నమ్ముతాం : మమతా బెనర్జీ

మత సామరస్యాన్ని నమ్ముతాం : మమతా బెనర్జీ

కోల్‌కతా : తృణమూ‌‌ల్‌ ప్రభుత్వం మత సామరస్యాన్ని నమ్ముతుందని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. అన్నిమతాల ప్రజల విశ్వాసాలను, ఆచారాలను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. శుక్రవారం మైనారిటీ హక్కుల దినోత్సవం సందర్భంగా కోల్‌కతాలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. భిన్నమతాల వారు కలిసిమెలసి జీవిస్తూ దేశాన్ని ఐక్యతకు చిహ్నంగా నిలిపారని, ఐక్యతే మన బలమని.. విడిపోతే నష్టపోతామని అన్నారు.

మైనారిటీ విద్యార్థులకు ఐక్యశ్రీ పథకం ద్వారా ఉపకార వేతనాలు అందిస్తున్నామని గుర్తుచేశారు. 2011 నుంచి ఇప్పటివరకు 2.03 కోట్ మంది విద్యార్థులకు రూ. 5,657 కోట్ల ఉపకార వేతనాలు అందించినట్లు తెలిపారు. మైనారిటీ విద్యార్థులు ఇంత మొత్తంలో ఉపకార వేతనాలు అందించిన రాష్ట్రం దేశంలో మరొకటి లేదని వెల్లడించారు. ఆర్థికంగా వెనుకబడిన మైనారిటీ విద్యార్థులతోపాటు పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారికి నైపుణ్యాలను పెంచుకునేందుకు శిక్షణ తీసుకుంటున్న వారికి ఈ పథకం కింద ఉపకార వేతనాలు అందుతున్నాయని ఆమె గుర్తుచేశారు.   

ఇవి కూడా చదవండి..

సింహాన్ని ఆటపట్టించిన ఆకతాయి.. వీడియో వైరల్‌

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌సేవింగ్స్‌ డేస్‌ సేల్‌..బంపర్‌ ఆఫర్లు

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.