బుధవారం 02 డిసెంబర్ 2020
National - Nov 14, 2020 , 15:44:35

బాలల ఆరోగ్య పరిరక్షణకు కృషి చేస్తున్నాం : యూపీ సీఎం

బాలల ఆరోగ్య పరిరక్షణకు కృషి చేస్తున్నాం : యూపీ సీఎం

గోరఖ్‌పూర్‌ : బాలల ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వ కట్టుబడి పనిచేస్తోందని యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ అన్నారు. శనివారం గోరఖ్‌పూర్‌లో నిర్వహించిన బాలల దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు. తూర్పు ఉత్తరప్రదేశ్‌లో 1977-2017 వరకు ఎన్సెఫలైటిస్‌ (మెదడు వ్యాపు) కారణంగా  50 వేల మందికిపైగా మృతి చెందారని యోగి గుర్తుచేశారు.

రాష్ట్రంలో మరుగుదొడ్ల నిర్మాణం ముమ్మరం చేశామని తెలిపారు. ఈ ఏడాది ఎన్సెఫలైటిస్ కారణంగా కేవలం 21 మంది మృతి చెందారని.. మరణాలను పూర్తిస్థాయిలో నివారించేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు. నేటి బాలలే రేపటి పౌరులని.. వారికి సరైన ఆరోగ్యం, విద్య, వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.