శుక్రవారం 03 ఏప్రిల్ 2020
National - Feb 11, 2020 , 01:05:34

‘ఎస్సీ, ఎస్టీ’ పదోన్నతులు చేపట్టలేకపోతున్నాం!

‘ఎస్సీ, ఎస్టీ’ పదోన్నతులు చేపట్టలేకపోతున్నాం!

న్యూఢిల్లీ: పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీ కోటా అంశం మరోసారి సుప్రీంకోర్టు ముందుకొచ్చింది. రిజర్వేషన్‌ కేటగిరిలో లేని ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తున్నారని, ఎస్సీ, ఎస్టీ కేటగిరిల్లో పదోన్నతులు చేపట్టడం లేదని మహారాష్ట్ర తరఫు న్యాయవాది ఇందిరా జైసింగ్‌ కోర్టుకు తెలిపారు. జార్ఖండ్‌ తరఫున హాజరైన న్యాయవాది పీఎస్‌ పట్వాలియా కూడా ఇలాంటి వాదనే వినిపించారు. అటర్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ వీటిని సమర్థించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ లక్ష పదోన్నతులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. ఈ అంశంలో యథాతథ స్థితిని కొనసాగించాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించడంతో ఈ ప్రక్రియకు ఆటంకం కలుగుతున్నదని బీహార్‌, మధ్యప్రదేశ్‌, త్రిపుర ఇటీవల కోర్టు దృష్టికి తీసుకువ చ్చాయి. రెండు వారాల తర్వాత పరిశీలిస్తామని చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ఏ బోబే ్డనేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. 
logo