బుధవారం 23 సెప్టెంబర్ 2020
National - Aug 13, 2020 , 16:12:44

ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధం

ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధం

జైపూర్: ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడు సతీశ్ పునియా తెలిపారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా తేడాలున్నాయని, ప్రభుత్వాన్ని నిలుపుకునేందుకు ఆ పార్టీ నేతలు చాలా కష్టపడుతున్నారని ఆయన విమర్శించారు. అసెంబ్లీలో బలం నిరూపించుకునేందుకు సీఎం గెహ్లాట్ ప్రయత్నిస్తున్నారని, దీంతో సభలో విశ్వాస తీర్మానాన్ని వారు ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని సతీశ్ పునియా అన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు తాము కూడా సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు.

రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం జైపూర్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ శాసనసభ పార్టీ సమావేశం జరిగింది. మాజీ సీఎం వసుంధర రాజే కూడా దీనికి హాజరయ్యారు. తమ మిత్రపక్షాలతో కలిసి శుక్రవారం అసెంబ్లీలో ప్రభుత్వంపై విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతామని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత గులాబ్ చంద్ కటారియా తెలిపారు.

logo