గురువారం 02 ఏప్రిల్ 2020
National - Mar 20, 2020 , 17:51:07

బీపీఎల్‌ కుటుంబాలకు మూడు నెలల రేషన్‌

బీపీఎల్‌ కుటుంబాలకు మూడు నెలల రేషన్‌

ముంబయి : రాష్ట్రంలో పేద కుటుంబాలకు మూడు నెలల రేషన్‌ సరుకులను ఒకేసారి పంపిణీ చేయనున్నట్లు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ తెలిపారు. కరోనా వైరస్‌ రోజురోజుకి వ్యాప్తి చెందుతున్న విషయం తెలిసిందే. దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 224కు చేరుకుంది. మహారాష్ట్రలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 52గా ఉంది. వీరిలో ముగ్గురు విదేశీయులు ఉన్నారు. వైరస్‌ వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు కావాల్సిన అన్ని సౌకర్యాలను తమ ప్రభుత్వం కల్పించనున్నట్లు అజిత్‌ పవార్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు.


logo
>>>>>>