శనివారం 04 ఏప్రిల్ 2020
National - Mar 18, 2020 , 15:25:34

ఎవ‌రూ అప‌హ‌రించ‌లేదు.. కోర్టుకు చెప్పిన రెబెల్ ఎమ్మెల్యేలు

ఎవ‌రూ అప‌హ‌రించ‌లేదు.. కోర్టుకు చెప్పిన రెబెల్ ఎమ్మెల్యేలు

హైద‌రాబాద్‌:  మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాజ‌కీయ సంక్షోభం.. ఇవాళ సుప్రీంకోర్టులో మార‌థాన్ విచార‌ణ‌కు దారితీసింది. బెంగుళూరులో ఉన్న 15 మంది ఎమ్మెల్యేల‌ను నిర్బంధించ‌లేద‌ని జ‌స్టిస్ చంద్ర‌చూడ్ అన్నారు. సీఎం క‌మ‌ల్‌నాథ్ ప్ర‌భుత్వం నుంచి త‌ప్పుకున్న సుమారు 22 మంది రెబ‌ల్ ఎమ్మెల్యేలు బెంగుళూరులో త‌ల‌దాచుకున్నారు. అయితే బ‌ల‌ప‌రీక్ష నిర్వ‌హించాల‌ని బీజేపీ సుప్రీం త‌ల‌పుల‌ను త‌ట్టింది.  కేసును విచారిస్తున్న చంద్ర‌చూడ్‌.. రెబ‌ల్ ఎమ్మెల్యేల‌ను అప‌హ‌రించార‌న్న వాద‌న‌ల‌ను కొట్టిపారేశారు. 

బెంగుళూరులో ఉన్న రెబ‌ల్ ఎమ్మెల్యేల‌ను క‌లుసుకునేందుకు ఇవాళ‌ దిగ్విజ‌య్ వెళ్లారు. అక్క‌డ స్థానిక పోలీసులు ఆయ‌న్ను అరెస్టు చేశారు. అయితే ఈ కేసులో బీజేపీ త‌ర‌పున సుప్రీంకోర్టులో సీనియ‌ర్ అడ్వ‌కేటు ముఖుల్ రోహ‌త్గీ వాదించారు.  రెబ‌ల్ ఎమ్మెల్యేల లేఖ‌లు అందుకున్న త‌ర్వాత‌నే గ‌వ‌ర్న‌ర్ లాల్జీ టాండ‌న్ ఫ్లోర్ టెస్టుకు అనుమ‌తి ఇచ్చిన‌ట్లు ముఖుల్ తెలిపారు. కానీ కాంగ్రెస్ మాత్రం బ‌ల‌ప‌రీక్ష నిర్వ‌హ‌ణ‌కు వెనుక‌డుతోంది.  త‌మ ఎమ్మెల్యేల‌ను అప‌హ‌రించిన‌ట్లు ఆ పార్టీ ఆరోపించింది.  కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌కు 30 కోట్ల వ‌ర‌కు ఇచ్చేందుకు బీజేపీ ఎర వేసింద‌ని దిగ్విజ‌య్ ఆరోపిస్తున్నారు.

రెబ‌ల్ ఎమ్మెల్యేల‌ను ఎవ‌రూ అప‌హ‌రించ‌లేద‌ని, కావాలంటే వారిని జ‌డ్జిల ముందు ప్ర‌వేశ‌పెడుతామ‌ని రోహ‌త్గీ తెలిపారు. బ‌ల‌ప‌రీక్ష నిర్వ‌హ‌ణ‌కు గ‌వ‌ర్న‌ర్ ఆమోదం స‌రిపోతుంద‌ని సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా తెలిపారు. మ‌మ్మ‌ల్ని ఎవ‌రూ అప‌హ‌రించ‌లేద‌ని రెబ‌ల్ ఎమ్మెల్యేల త‌ర‌పున వాదించిన అడ్వ‌కేటు మ‌ణింద‌ర్ సింగ్ తెలిపారు. కోర్టుకు సీడీ రూపంలో ఎమ్మెల్యేల వాయిస్‌ను ప్ర‌జెంట్ చేస్తున్న‌ట్లు చెప్పారు. 


logo