ఆదివారం 29 మార్చి 2020
National - Mar 18, 2020 , 02:31:17

అనుమానితుల చేతిపై ముద్ర

అనుమానితుల చేతిపై ముద్ర

ముంబై: ఎన్నికల సమయంలో ఓటర్‌ ఎడమ చేతి చూపుడు వేలుకు సిరాచుక్క పెట్టినట్టుగా.. కరోనా వైరస్‌ అనుమానితులకు కూడా మహారాష్ట్ర ప్రభుత్వం ముద్ర (స్టాంప్‌) వేస్తున్నది. ఈ ముద్రపై ‘రక్షిస్తున్నందుకు గర్విస్తున్నాం.. హోం క్వారంటైన్‌డ్‌.. 30 మార్చి 2020’ అని రాసి ఉన్నది. కరోనా అనుమానితులు స్వీయనిర్బంధాన్ని ఉల్లంఘించినట్లయితే ఇతరులు వారిని గుర్తించేందుకు వీలుగా వారి కుడి చేతిపై చెరిగిపోని సిరాతో స్టాంప్‌ వేస్తున్నారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్‌ తోపే కూడా ధ్రువీకరించారు. గతంలో కొందరు కరోనా అనుమానితులు మహారాష్ట్రలోని దవాఖానల నుంచి పారిపోవడంతో ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన స్పష్టంచేశారు. స్వీయనిర్బంధాన్ని ఉల్లంఘించి వీరు బహిరంగ ప్రదేశాల్లోకి వెళితే.. ఇతరులు గుర్తించి వారికి దూరంగా ఉండేందు కోసం ఇలాంటి చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని రాజేశ్‌ తోపే పేర్కొన్నారు. logo