ఆదివారం 28 ఫిబ్రవరి 2021
National - Jan 21, 2021 , 22:35:35

పురావ‌స్తు త‌వ్వ‌కాల్లో బ‌య‌ట‌ప‌డ్డ‌ మొఘ‌ల్ ‘వాట‌ర్ ట్యాంక్‌‌’

పురావ‌స్తు త‌వ్వ‌కాల్లో బ‌య‌ట‌ప‌డ్డ‌ మొఘ‌ల్ ‘వాట‌ర్ ట్యాంక్‌‌’

ల‌క్నో: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఆగ్రా జిల్లా ప‌రిధిలో ఫ‌తేపూర్ సిక్రీలో 16వ శ‌తాబ్ది నాటి మొఘ‌ల్ చ‌క్ర‌వ‌ర్తులు నిర్మించిన వాట‌ర్ ట్యాంక్ బ‌య‌ల్ప‌డింది. ఆర్కియాలజిక‌ల్ స‌ర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) చేప‌ట్టిన ఈ త‌వ్వ‌కాల్లో ఈ సంగ‌తి తేలింది. తోడ‌రమ‌ల్ బారాదారి ప‌రిర‌క్ష‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా ఏఎస్ఐ ఫ‌తేపూర్ సిక్రీ విభాగం త‌వ్వ‌కాలు చేప‌ట్టింది. స్వేచ్ఛ‌గా గాలి లోప‌లికి వ‌చ్చేందుకు 12 త‌లుపుల‌తో నిర్మించిన భ‌వ‌నం (పెవిలియ‌న్‌) బారాదారి. బ‌య‌ట‌ప‌డ్డ వాట‌ర్ ట్యాంక్ మ‌ధ్య‌లో ఫౌంటేన్ ఉండ‌టం ఆస‌క్తిక‌ర ప‌రిణామం.

ఏఎస్ఐ ఆగ్రా స‌ర్కిల్ సూప‌రింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ వ‌సంత్ స్వ‌రంక‌ర్ మాట్లాడుతూ.. తాము చేప‌ట్టిన తవ్వ‌కాల్లో 8.7 మీట‌ర్ల వెడ‌ల్పు, 1.1 మీట‌ర్ లోతు గ‌ల ట్యాంక్ బ‌య‌ట‌ప‌డింది. మ‌ధ్య‌లో ఒక ఫౌంటేన్ కూడా ఉంది. దీన్ని బారాదారితోపాటు నిర్మించి ఉండొచ్చున‌ని చెప్పారు. దీంతో మ‌రికొన్ని విష‌యాల‌ను తెలుసుకునేందుకు పురావ‌స్తు శాఖ త‌వ్వ‌కాలు కొన‌సాగించాల‌ని యోచిస్తున్న‌ది. మొగ‌ల్ చ‌క్ర‌వ‌ర్తుల్లో అక్బ‌ర్ హ‌యాంలో రాజా తోడ‌ర‌మ‌ల్ ఆర్థిక మంత్రిగా ప‌ని చేశారు. అక్బ‌ర్ ప్ర‌భుత్వంలో న‌వ‌ర‌త్నాలు అనే పేరిట నూత‌న ప‌న్నుల వ్య‌వ‌స్థ‌ను తోడ‌ర‌మ‌ల్ ప్ర‌వేశ‌పెట్టారు.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo