గురువారం 09 జూలై 2020
National - Jan 23, 2020 , 06:41:43

క్షణాల్లో కూలిన వాటర్‌ ట్యాంక్‌..

క్షణాల్లో కూలిన వాటర్‌ ట్యాంక్‌..

పశ్చిమబెంగాల్‌లోని బంకుర జిల్లాలో గల ఓ వాటర్‌ ట్యాంక్‌ నిర్మించిన నాలుగు సంవత్సరాల వ్యవధిలోనే పునాదులతో సహా క్షణాల్లో కూలిపోయింది.

బంకుర: పశ్చిమబెంగాల్‌లోని బంకుర జిల్లాలో గల ఓ వాటర్‌ ట్యాంక్‌ నిర్మించిన నాలుగు సంవత్సరాల వ్యవధిలోనే పునాదులతో సహా క్షణాల్లో కూలిపోయింది. ఈ వాటర్‌ ట్యాంక్‌ నుంచి పలు గ్రామాలకు తాగునీరు సరఫరా చేస్తారు. ఈ విషయాన్ని స్థానికంగా ఉన్న కొందరు యువకులు తమ సెల్‌ఫోన్‌లలో చిత్రీకరించి, స్థానిక మీడియా సంస్థలకు అందజేయగా, అది కాస్తా వైరల్‌ అయింది. 

పబ్లిక్‌ హెల్త్‌ ఇంజనీరింగ్‌ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఓ ఆఫీసర్‌ మాట్లాడుతూ.. 2016లో నిర్మించిన ఈ ట్యాంక్‌ నుంచి దాదాపు 16 గ్రామాలకు మంచినీటి సరఫరా అవుతోంది. ఈ ట్యాంక్‌ నీటి సామర్థ్యం 7 లక్షల లీటర్లు. కాగా, ఈ ఘటనపై త్వరలోనే విచారణ జరిపిస్తామని, ట్యాంక్‌ నిర్మాణ సంస్థకు 5 ఏళ్ల కాంట్రాక్టు ఉందనీ.. దీంతో ట్యాంక్‌ను వారితోనే పునర్‌నిర్మిస్తామని అతడు తెలిపాడు. 


logo