బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 03, 2020 , 14:29:25

ముంబైలో కుంభ‌వృష్టి

ముంబైలో కుంభ‌వృష్టి

ముంబై: మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబైలో వ‌రుణుడు బీభ‌త్సం సృష్టిస్తున్నాడు. శుక్ర‌వారం తెల్ల‌వారుజాము నుంచే ఎడ‌తెర‌పిలేకుండా వ‌ర్షం కురుస్తుండ‌టంతో ప‌లు ప్రాంతాలు జ‌ల‌మ‌య‌మ‌య్యాయి. రోడ్ల‌పై భారీగా వ‌ర‌ద నీరు నిలిచింది. దీంతో వివిధ అవ‌స‌రాల నిమిత్తం బ‌య‌ట‌కు వ‌చ్చిన జ‌నం తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. వ‌డాలా, కింగ్స్ స‌ర్కిల్‌, హింద్‌మాతా ఏరియాల్లో ర‌హ‌దారులు చెరువుల‌ను త‌ల‌పించాయి.

దీంతో రంగంలోకి దిగిన ముంబై పోలీసులు, విప‌త్తు నిర్వ‌హ‌ణ బ‌ల‌గాలు స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టాయి. డ్రైనేజీల్లో అడ్డంకుల‌ను తొల‌గించి వ‌ర‌ద‌నీరు వెళ్లిపోయేలా చ‌ర్య‌లు చేప‌ట్టారు. హింద్‌మాతా ఏరియాలో రోడ్డుపై భారీగా వ‌ర‌ద‌నీరు నిలువ‌డంతో ప్ర‌జ‌లు ప‌డుతున్న ఇబ్బందులను ఈ కింది వీడియోలో చూడ‌వ‌చ్చు.      

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo