సోమవారం 25 మే 2020
National - May 23, 2020 , 17:58:48

అసోంలో ఎడతెగని వర్షం.. ఉప్పొంగుతున్న బ్రహ్మపుత్ర

అసోంలో ఎడతెగని వర్షం.. ఉప్పొంగుతున్న బ్రహ్మపుత్ర

గువాహటి: అసోంలో బ్రహ్మపుత్ర నది ఉప్పొంగి ప్రవహిస్తున్నది. గత రెండు మూడు రోజులుగా అసోంలోని బ్రహ్మపుత్ర నది పరివాహక ప్రాంతాల్లో ఎడతెగని వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పరిసర ప్రాంతాల నుంచి నదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. ఈ కారణంగా నది ప్రవాహ ఉధృతి అంతకంతకూ పెరిగిపోతున్నది. దీంతో నదీ తీర ప్రాంతాల్లోని వ్యాపార సముదాయాలు నీట మునిగాయి. 

అసోంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల బ్రహ్మపుత్ర నది పొంగి పొర్లుతున్నదని సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ వెల్లడించింది. మే 16వ తేదీ నుంచి నదిలోని నీటి మట్టం క్రమంగా పెరుగుతూ వస్తున్నదని తెలిపింది. ప్రతి రెండు మూడు నిమిషాలకు నదిలోని నీటిమట్టం 1, 2 సెంటీ మీటర్లు పెరుగుతున్నదని పేర్కొన్నది. కాగా బ్రహ్మపుత్ర ఉధృతితో నదీతీర ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు.


logo