శనివారం 15 ఆగస్టు 2020
National - Jul 27, 2020 , 11:52:42

పోలీసుల‌కు దొర‌క్కూడ‌ద‌ని స‌ముద్రంలోకి దూకిన కుర్రాళ్లు.. కొంత‌మంది అరెస్ట్‌!

పోలీసుల‌కు దొర‌క్కూడ‌ద‌ని స‌ముద్రంలోకి దూకిన కుర్రాళ్లు.. కొంత‌మంది అరెస్ట్‌!

బ‌య‌ట తిరిగితే క‌రోనా వ‌స్తుంది అని త‌ల‌, నోరు బ‌ద్ద‌లు కొట్టుకున్నా ఎవ‌రూ విన‌ట్లేదుగా.. హా! అంద‌రికీ వ‌చ్చినా నాకు మాత్రం రాదులే అని ధైర్యంగా కాల‌ర్ ఎగ‌రేస్తున్నారు. ధైర్యసాహ‌సాలు ప్ర‌ద‌ర్శించే స‌మ‌యం కాదు. జాగ్ర‌త్త‌గా, అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిన స‌మ‌యం. చ‌దుకునే కుర్రాళ్లు, న‌లుగురికి అర్థ‌మ‌య్యేలా చెప్పాల్సిన 35 మంది కుర్రాళ్లు క్రికెట్ ఆడుతూ పోలీసుల కంట ప‌డ్డారు. ముంబైలోని విరార్ ప్రాంతంలో ఉన్న అర్నాలా బీచ్‌లో గుంపులు గుంపులుగా ఆడుతున్న వాళ్లంతా పోలీసుల‌ను చూడ‌గానే ఎటు వెళ్లాలో అర్థం కాక బీచ్‌లోకి దూకి ఎస్కేప్ అవ్వాల‌నుకున్నారు.

ఇక్కొక్క‌రు ఒక్కో వైపుకు ఈత కొట్టుకుంటూ వెళ్తున్నారు. కొంద‌రైతే బీచ్‌లో ఉన్న ఒక ప‌డ‌వ ఎక్కేసి పారిపోయారు. వీళ్ల‌ని మాత్రం పోలీసులు వ‌దిలిపెట్ట‌లేదు. స్థానిక గ్రామంలోని 14మంది యువ‌కుల‌పై కేసు న‌మోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. మిగ‌తా కుర్రాల‌ను వెతికే ప‌నిలో ఉన్నారు పోలీసులు. అస‌లే మ‌హారాష్ట్ర‌లో క‌రోనా కేసులు  ఎక్కువ‌వుతున్నాయ‌ని కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధించారు. అయినా మ‌నుషులు మార‌డం లేదు. 


logo