గురువారం 06 ఆగస్టు 2020
National - Jul 27, 2020 , 18:29:46

బద్రీనాథ్‌ జాతీయ రహదారిపై విరిగిపడిన కొండచరియలు

బద్రీనాథ్‌ జాతీయ రహదారిపై విరిగిపడిన కొండచరియలు

చమోలీ : ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని చమోలీ జిల్లా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సోమవారం గౌచర్ ఐటీబీపీ (ఇండో టిబెటన్‌ బార్డర్‌ పోలీస్‌) క్యాంపు సమీపంలో బద్రీనాథ్ హైవేపై భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో రహదారి ఇరువైపులా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. అకస్మాత్తుగా కొండచరియలు జాతీయ రహదారిపైకి జారిపడినా ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం జరుగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. రహదారిపై కొండచరియలు తొలగించేందుకు విపత్తు స్పందనా దళం చర్యలు చేపట్టింది. భారీ వర్షాల కారణంగా ఈ సీజన్‌లో ఇక్కడ తరచూ కొండచరియలు విరిగిపడుతుంటాయి. కొండ చరియలు విరిగిపడుతున్న దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేయగా ఆ దృశ్యాలు వైరల్‌గా మారాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు బద్రీనాథ్‌ జాతీయ రహదారి ఇంత ప్రమాదకరమా.! అంటూ చర్చించుకుంటున్నారు.

logo