గురువారం 02 జూలై 2020
National - Jun 20, 2020 , 13:59:01

విజ‌యాలే కాదు.. అప్పుడ‌ప్పుడు ఓట‌మి కూడా ఆనందాన్నిస్తుంది!

విజ‌యాలే కాదు.. అప్పుడ‌ప్పుడు ఓట‌మి కూడా ఆనందాన్నిస్తుంది!

విజ‌యం సాధిస్తేనే మోములో ఆనందం క‌నిపిస్తుంది అంటే ప్ర‌పంచంలో సంతోష‌మే క‌రువ‌వుతుంది. చాలా సీరియ‌స్‌గా జ‌రిగే ఆటల్లో ఒక్కోసారి ఇలా ఫ‌న్ జ‌ర‌గ‌డం సాధార‌ణ‌మే అంటున్నారు ట్విట‌ర్ యూజ‌ర్ జో మోరిస‌న్‌. ఈ వీడియోలో ఒక చిన్న పిల్ల‌వాడు ఫుట్‌బాల్ ఆడ‌డం అంద‌రినీ న‌వ్వించింది.

చుట్టూ జ‌నం. మ‌ధ్య‌లో బాల్‌. దీ‌న్ని గ‌ట్టిగా త‌న్నేందుకు ఈ పిల్లాడు చాలా దూరం వెన‌క్కి వెళ్లి ప‌రుగెత్తుకుంటూ వ‌చ్చాడు. త‌న్నేట‌ప్పుడు కాళ్లు ప‌క్కకి పోవ‌డంతో అదుపు త‌ప్పి కింద ప‌డ్డాడు. దీంతో అక్క‌డున్న వాళ్లంతా న‌వ్వారు. కింద ప‌డ‌డానికి ఇంత దూరం వెళ్లాలా అన్న‌ట్లు నవ్వారు. పాపం చిన్న పిల్లోడు న‌వ్వుల‌పాల‌య్యాడు.  12 సెకండ్ల పాటున‌డిచే ఈ వీడియోలో పిల్ల‌వాడు ఓడిపోయిన‌ప్ప‌టికీ అంద‌రినీ న‌వ్వించాడు.  అత‌ను ఆడే విధానం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. 'ఈ కథ యొక్క నైతికత: ఇది మీ పరుగుల పొడవు గురించి కాదు !! ప్ర‌తిఒక్క‌రూ ఈ రోజుని ఆనందించండి' అని నవ్వుతున్న రెండు ఎమోజీలను జోడించి జో మోరిసన్ ట్విట్టర్‌లో షేర్ చేశాడు. ఇప్పుడు ఇది బాగా హ‌ల్‌చ‌ల్ చేస్తున్న‌ది.


logo