శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Jul 31, 2020 , 17:16:16

వీళ్లు క్వారెంటైన్‌లో ఉన్నారా..? డ్యాన్స్ క్ల‌బ్‌లో ఉన్నారా?

వీళ్లు క్వారెంటైన్‌లో ఉన్నారా..?  డ్యాన్స్ క్ల‌బ్‌లో ఉన్నారా?

క‌రోనా వైర‌స్ రాక‌తో మ‌న‌వ జీవ‌న శైలిలో మార్పులు వ‌చ్చాయి. ప్ర‌తి క్ష‌ణానికి ఎంతో ప్రాముఖ్య‌త‌నిస్తున్నారు. ఎప్పుడు క‌రోనా వ‌చ్చిపోతామో తెలియ‌దు. అప్ప‌టివ‌ర‌కు ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆనందంగా ఉందామ‌నుకుంటున్నారు. అందుకే ఆరోగ్యం ప‌ట్ల జాగ్ర‌త్త‌లు, లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను అవ‌లంబిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ క‌రోనా బారిన ప‌డుతునే ఉన్నారు. దీంతో వారిని నిర్భంధ‌ కేంద్రంలో ఉంచుతున్నారు.

నాలుగు గోడ‌ల మ‌ధ్య క్వారెంటైన్‌లో ఉండ‌డం వ‌ల్ల వారు మ‌న‌స్తాపానికి గుర‌వుతున్నారు. దీనిదెబ్బ‌కి రోగులు భ‌యంతో ఉన్నారు. వారిలో ఉన్న భ‌యాన్ని పోగొట్టి మునిప‌టిలా ఆనందంగా ఉంచేందుకు క్వారెంటైన్‌లో పాట‌లు పెట్టి రోగుల‌తోపాటు ఆరోగ్య సిబ్బంది క‌లిసి డ్యాన్సులు చేస్తున్నారు. ఇది ఎక్క‌డ జ‌రిగిందో కాని క‌రోనాకే చుక్క‌లు చూపిస్తున్నారు. అందుకే ఈ వీడియో నెట్టింట్లో వైర‌ల్‌గా మారింది. 


 

 


logo