e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 25, 2021
Home News అరెస్ట్ అంత ఈజీ కాదు సుమీ.. వీడియో

అరెస్ట్ అంత ఈజీ కాదు సుమీ.. వీడియో

చండీగ‌ఢ్‌: ఏవైనా నేరాలు, గొడ‌వ‌లు జ‌రిగిన చోట పోలీసులు లాఠీలు ప‌ట్టుకుని కారు దిగితే చాలు జ‌నం చెప్పులు చేతిలో ప‌ట్టుకుని ప‌రుగులు తీస్తారు. ఎందుకంటే లాఠీ దెబ్బ‌కు ఛాన్స్ ఇచ్చామంటే ఒంటిపై చ‌ర్మం చిట్ల‌డం ఖాయ‌మ‌ని వారికి తెలుసు. కానీ అన్ని చోట్లా ఖాకీల‌ను చూసి జ‌నం ఇలాగే భ‌య‌ప‌డుతార‌నుకుంటే పొర‌పాటు. అరెస్ట్ చేయ‌డానికి వ‌చ్చిన‌ పోలీసులు గద్దిస్తే చాలు నేరస్తులు కారెక్క‌డం లేదంటే పారిపోయేందుకు ప్ర‌యత్నించ‌డమ‌నేది స‌హ‌జంగా జ‌రుగుతుంది.

కానీ, కొన్ని ప్రాంతాల్లో నేర‌స్తుల‌ను అరెస్ట్ చేయ‌డం అంత ఈజీ కాదు సుమీ..! ఎందుకంటే నేర‌గాళ్లు, వాళ్ల మ‌నుషులు పోలీసుల‌పైనే తిర‌గ‌బ‌డతారు. నేర‌స్తులు త‌ప్పించేందుకు పోలీసుల‌పై దాడి చేయ‌డానికి, అవ‌స‌ర‌మైతే చంపడానికి కూడా వెనుకాడ‌రు. నేరాల‌నే వృత్తిగా మార్చుకున్న‌ జ‌నం నివ‌సించే బ‌స్తీల్లో ఇలాంటివి జ‌రుగుతుంటాయి. తాజాగా హ‌ర్యానా రాష్ట్రం ఫ‌తేహాబాద్‌లోని బాజీగ‌ర్ బ‌స్తీలో ఇలాంటి ఘ‌ట‌నే జ‌రిగింది.

- Advertisement -

మాద‌క‌ద్ర‌వ్యాలు స‌ర‌ఫ‌రా చేస్తున్న ఓ వ్య‌క్తిని అరెస్ట్ చేసేందుకు మ‌ఫ్టీలో వెళ్లిన పోలీసులపై అత‌ని కుటుంబ‌స‌భ్యులు, ఇరుగుపొరుగు వారు తిర‌గ‌బ‌డ్డారు. కానీ, పోలీసులు మాత్రం ప‌ట్టు విడ‌వ‌లేదు. ఎగ‌బ‌డ్డ జ‌నం అంద‌రినీ అద‌ర‌గొట్టి నేర‌స్తుడిని అరెస్టు చేసి పోలీస్‌స్టేష‌న్‌కు తీసుకెళ్లారు. ఈ అరెస్టుకు సంబంధించిన దృశ్యాల‌ను ఓ వ్య‌క్తి వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో వైర‌ల్‌గా మారింది. ఆ దృశ్యాల‌ను కింది వీడియోలో మీరు కూడా వీక్షించ‌వ‌చ్చు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana