బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 03, 2020 , 16:46:46

క‌రోనా వేళ అమ్మాయిల బెల్లీ డ్యాన్సులు.. ర‌చ్చ చేసిన యువ‌కులు!

క‌రోనా వేళ అమ్మాయిల బెల్లీ డ్యాన్సులు.. ర‌చ్చ చేసిన యువ‌కులు!

క‌రోనా పేరే గాని ఒక్క‌రికి కూడా భ‌యం లేకుండా పోయింది. ఏముందిలే.. ఎన్నిరోజుల‌ని ఇంట్లోనే ఉంటాం. అంద‌రికి వ‌చ్చినా గాని మ‌న‌కు క‌రోనా రాదులే అని నిర్ల‌క్ష్యం చూపించిన యువ‌కులు అమ్మాయిల‌తో బెల్లీ డ్యాన్స్ నిర్వ‌హించారు. బెంగ‌ళూరు నుంచి తీసుకువ‌చ్చిన అమ్మాయిల‌తో కేర‌ళ‌లోని ఇడుక్కి రిసార్ట్‌లో ఎంజాయ్ చేశారు.

కొవిడ్‌-19 నిబంధ‌లు ఒక‌టి కూడా పాటించ‌కుండా సుమారు ఐదు గంట‌ల‌పాటు ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. అమ్మాయిలు డ్యాన్స్ చేస్తుంటే యువ‌కులు ఈళ‌లు వేస్తూ అమ్మాయిల ముందుకు వ‌చ్చి ర‌చ్చ ర‌చ్చ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో 250 మంది పాల్గొన్నారు. 50 మంది చొప్పున విడ‌త‌ల‌వారీగా పాల్గొన్నార‌ని స‌మాచారం. వీరిలో కొంద‌రు వీడియోలు తీసి సోష‌ల్‌మీడియాలో షేర్ చేశారు. ఇవి కాస్త వైర‌ల్ కావ‌డంతో పోలీసుల వ‌ర‌కు వెళ్లింది. ఇప్ప‌టివ‌ర‌కు దీని గురించి ఎవ‌రూ ఫిర్యాదు ఇవ్వ‌లేద‌ని వీరిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పోలీసులు తెలిపారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo