బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 18, 2020 , 18:04:21

రిమోట్‌ బోట్.. ఇది ప్ర‌పంచంలోనే అతి పెద్ద‌ది!

రిమోట్‌ బోట్.. ఇది ప్ర‌పంచంలోనే అతి పెద్ద‌ది!

మ‌నిషి త‌లుచుకుంటే ఏ ప‌నైనా చేయ‌గ‌ల‌డు. ఇంటి నుంచే అద్భుతాలు సృష్టించ‌గ‌ల‌డు. ఆ విధంగా కేర‌ళ‌కు చెందిన ఓ కుర్రాడు ఆర్‌సీ బోట్ త‌యారు చేసి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. అంతేకాదు ఈ బోట్ ఎలా త‌యారు చేయాలో వీడియో తీసి యూట్యూబ్‌లో కూడా అప్‌లోడ్ చేశారు. ఈ ప‌డ‌వ న‌డ‌ప‌డానికి రిమోట్ ఉంటే స‌రిపోతుంది. ఎవ‌రైనా న‌డిపేయొచ్చు. జ‌స్ట్ రిమోట్ కంట్రోల్ చేయ‌డం వ‌స్తే చాలు అన్న‌మాట‌. ఈ బోట్ ప్ర‌పంచంలోనే అతి పెద్ద ఆర్‌సి ప‌డ‌వ‌.

పివిసి వైపును నాలుగు ముక్క‌లుగా క‌ట్ చేసి వాటిని ప‌డ‌వ‌కు బేస్‌గా ఉప‌యోగించాడు. త‌ర్వాత రెండు చివ‌ర‌ల‌ను మ‌ధ్య‌లో ఉంచి రెండు పివిసి పైపుల‌పై మూసివేశాడు. పివిసి ముక్క పడవ ఆకారాన్ని పూర్తి చేసే ఇతర ముక్కలతో కలుపుతారు. ఈ పివిసి ఫ్రేమ్‌పై తయారు చేసిన మెటల్ ఫ్రేమ్‌ను ఉంచాడు. ఇలా అన్ని పివిసి వైపుల‌ను అమ‌ర్చిన త‌ర్వాత ప‌డ‌వ‌ను న‌డిపించేందుకు రెండు ఎల‌క్ట్రిక్ మోట‌ర్లు అమ‌ర్చారు.  ప్రొపెల్లర్‌ను ఉప‌యోగించి సర్వో మోటారుకు అనుసంధానించబడి ఉంది. సెటప్ మొత్తం రిమోట్ కంట్రోల‌తో నియంత్రించే రిసీవర్‌కు కనెక్ట్ చేసి ఉంటుంది. దీనికి12V బ్యాటరీ అమ‌ర్చారు. ప‌డ‌వను పూర్తిగా త‌యారు చేసిన త‌ర్వాత వాట‌ర్‌బాడీ వ‌ద్ద‌కు తీసుకెల్లి ట్ర‌య‌ల్స్ వేశారు. స‌క్సెస్ కావ‌డంతో ఆనందం వ్య‌క్తం చేశాడు. ఇది త‌యారు చేయ‌డానికి నెల రోజులు ప‌ట్టింద‌ట‌. ఏదైతేనేం ఇత‌ని తెలివికి జోహార్లు కొట్టాల్సిందే.. logo