సోమవారం 03 ఆగస్టు 2020
National - Jul 28, 2020 , 12:10:08

నా బ‌ట్ట‌లు నేనే ఉతుక్కుంటున్నా: మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎం వీడియో

నా బ‌ట్ట‌లు నేనే ఉతుక్కుంటున్నా:  మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎం వీడియో

హైద‌రాబాద్‌: మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎం శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌.. కరోనా వైర‌స్ పాజిటివ్ చికిత్స పొందుతున్న విష‌యం తెలిసిందే.  భోపాల్‌లోని చిరాయు ఆస్ప‌త్రిలో ఆయ‌న‌కు చికిత్స జ‌రుగుతున్న‌ది. ఆయ‌న భార్య‌కు మాత్రం వైర‌స్ ప‌రీక్ష‌లో నెగ‌టివ్ వ‌చ్చింది. హాస్పిట‌ల్ నుంచి సీఎం శివ‌రాజ్‌.. వ‌ర్చువ‌ల్ వీడియోలో మాట్లాడారు.  తాను కోవిడ్ పాజిటివ్ పేషెంట్‌ను అని, త‌న బ‌ట్ట‌ల్ని తానే ఉతుక్కుంటున్న‌ట్లు చెప్పారు.  అయితే త‌న బ‌ట్ట‌ల్ని తానే ఉతుక్కోవ‌డం వ‌ల్ల త‌న‌కు బెనిఫిట్ జ‌రిగింద‌న్నారు.  త‌న చేతికి ఇటీవ‌ల శ‌స్త్ర‌చికిత్స జ‌రిగింద‌ని, ఎన్నోసార్లు ఫిజియోథెర‌పి చేయించినా.. పిడికిలి ప‌ట్టుకోవ‌డం వ‌చ్చేది కాదు అని, కానీ బ‌ట్ట‌లు ఉత‌కడం ప్రారంభించిన త‌ర్వాత ఇప్పుడు త‌న చేయి సులువుగా ప‌నిచేస్తున్న‌ట్లు సీఎం ఓ వీడియోలో వెల్ల‌డించారు. 

సోమ‌వారం కూడా సీఎం శివ‌రాజ్ వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారానే త‌న విధుల‌ను నిర్వ‌ర్తించారు. రెండ‌వ సారి కూడా ఆయ‌న శ్యాంపిల్‌లో క‌రోనా ప‌రీక్ష‌లో పాజిటివ్‌గా తేలింది. క్యాబినెట్‌లోని న‌రోత్త‌మ్ మిశ్రా, విశ్వాస్ సారంగ్‌, ప్ర‌భురామ్ చౌద‌రీల‌కు కొన్ని బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించారు. హాస్పిట‌ల్‌లో చికిత్స పొందిన‌న్ని రోజులు సీఎం ఎటువంటి ఫైళ్ల‌పై సంత‌కం చేయ‌ర‌న్నారు. అయితే హాస్పిట‌ల్‌కు విజిట‌ర్లకు అనుమ‌తి ఇచ్చి సీఎం శివ‌రాజ్ .. స్టంట్ క్రియేట్ చేస్తున్నార‌ని ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.


logo