సోమవారం 23 నవంబర్ 2020
National - Nov 14, 2020 , 14:24:48

అయోధ్యలో దీపం వెలిగించాలనుకుంటున్నారా?

అయోధ్యలో దీపం వెలిగించాలనుకుంటున్నారా?

అయోధ్య:  అయోధ్యలో ఈ ఏడాది రామమందిరానికి ప్రధాని భూమిపూజ చేశారు. దేశప్రజల ఎన్నో ఏళ్ల కల నెరవేరింది. మరి అలాంటి పవిత్ర ప్రదేశంలో దీపావళి సందర్భంగా దీపం వెలిగించాలనుకుంటున్నారా?ఇంటినుంచే అక్కడ జరిగే దీపోత్సవ్‌లో పాల్గొనాలనుకుంటున్నారా?  అయితే వర్చువల్‌ దీపోత్సవ్‌ వేడుకల్లో పాల్గొనండి. అయోధ్యలో మొదటి దీపోత్సవ్‌ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఉత్తరప్రదేశ్‌ సర్కారు ఏర్పాట్లు చేసింది.  

ఈ ఏడాది దీపావళి సందర్భంగా అయోధ్యలో దియాస్ వర్చువల్ లైటింగ్ కోసం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వెబ్ పోర్టల్ ఏర్పాటు చేసింది. రాముడి భక్తులు మట్టి, రాగి లేదా ఇత్తడి దీపాలను ఎంపిక చేసుకోవచ్చు. దీపాల్లో  పోసేందుకు ఆవ నూనె, నెయ్యి లేదా నువ్వుల నూనెలను కూడా ఎంచుకోవచ్చు. కీబోర్డు బటన్ లేదా మౌస్‌క్లిక్‌తో అయోధ్యలో దీపాన్ని వెలిగించవచ్చు. వివరాలకు http://virtualdeepotsav.com వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.