శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
National - Jul 19, 2020 , 15:30:31

కరోనా దవాఖానలో పందుల సంచారం.. వీడియో

కరోనా దవాఖానలో పందుల సంచారం.. వీడియో

కల్బుర్గి :  : కర్ణాటక రాష్ర్టంలో ఇప్పటికే కరోనా కేసులు పెరుగుతుంటే, ఇక్కడి కల్బుర్గిలోని కరోనా రోగులు చికిత్స పొందుతున్న దవాఖానలో పందులు సంచరిస్తున్నాయి. ఇప్పటికే కరోనా అంటు వ్యాధితో జనాలు పిట్టల్లా రాలిపోతుంటే దవాఖానలోనే పందులు తిరుగుతుండడంతో అంటు వ్యాధులు మరింత పెరిగే అవకాశం ఉందని దవాఖానలోని రోగులు భయాందోళనకు గురవుతున్నారు. 

అయితే దేశంలో మొదటి కరోనా మరణం కల్బుర్గిలోనే సంభవించిన విషయం తెలిసిందే. దవాఖాన వార్డుల్లో పందులు సంచరిస్తున్నాయని స్థానిక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ప్రియాంక్ ఖర్గే దృష్టికి తీసుకెళ్లగా.. తాను దవాఖానను పరిశీలించానని.. అవి వార్డులోకి ఎలా ప్రవేశించాయో తెలియడం లేదని.. ఈ జిల్లాపై ఉప ముఖ్యమంత్రి దృష్టి పెట్టలేదని ఆయన ఆరోపించారు. 

ఆరోగ్య మంత్రి శ్రీరాములు మాట్లాడుతూ తక్షణ చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించామన్నారు. పందులను పట్టుకొని దవాఖాన వెలుపల వదిలేసినట్లు తెలిపారు. ఇంకోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. 


దేశంలో మొదటి కరోనా మరణం కల్బుర్గిలో మార్చి 13న జరిగింది. కరోనా సోకిన రోగికి (76) సౌదీ అరేబియా నుంచి ఫిబ్రవరి 29న కల్బుర్గికి తిరిగి వచ్చి ఇక్కడ మరణించాడు. అయితే కర్ణాటకలో శనివారం కొత్తగా 4,537 కరోనా కేసులు నమోదయ్యాయి. అంతే కాకుండా శనివారం 93 మంది కరోనాతో మరణించారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 1240కు చేరింది.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo