గురువారం 09 జూలై 2020
National - Apr 04, 2020 , 14:39:03

కరోనాపై గ్రామాల్లో గోడలపై ప్రచారం

కరోనాపై గ్రామాల్లో గోడలపై ప్రచారం

హైదరాబాద్‌: కరోనాపై పట్టణవాసుల కంటే గ్రామీణప్రాంతాల ప్రజలే అప్రమత్తంగా ఉన్నారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతుండటంతో ఈ మహమ్మారిపై అవగాహన కల్పిస్తూ గోడలపై రాతలు రాస్తున్నారు. పశ్చిమబెంగాల్‌లోని బుర్దాన్‌ జిల్లా జమల్పూర్‌, మెమారి గ్రామాల్లోని ఇండ్లపై ఇలాంటి వాల్‌ పెయింటింగ్స్‌ ఇప్పుడు కన్పిస్తున్నాయి. ఈ వైరస్‌ బారిన పడకుండా ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి, వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి అని పేర్కొంటూ కరోనాకు సంబంధిచిన వివరాలు గోడలపై ఉన్నాయి.


logo