బుధవారం 03 జూన్ 2020
National - May 10, 2020 , 09:25:07

కుప్ప‌కూలిన గోడ‌..ఐదుగురిని కాపాడిన ఎన్డీఆర్ఎఫ్

కుప్ప‌కూలిన గోడ‌..ఐదుగురిని కాపాడిన ఎన్డీఆర్ఎఫ్

ముంబై: ముంబైలోని కందివ‌లి ఏరియాలో వేకువజామునే ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఓ ఇంటి గోడ కుప్ప‌కూలిపోవ‌డంతో..ఐదుగురు శిథిలాల కింద చిక్కుకున్నారు. రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టి ముందుగా ముగ్గురిని బ‌య‌ట‌కు తీశారు. త‌ర్వాత మ‌రో ఇద్ద‌రిని సుర‌క్షితంగా బ‌య‌ట‌కు తీశారు.

గాయాలైన వారిని వెంట‌నే ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స‌నందిస్తున్నారు. ద‌ల్జిప‌డా ప్రాంతంలోని స‌బ్రియా మ‌సీదు స‌మీపంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఘ‌ట‌న జ‌రిగిన స‌మ‌యంలో ఎక్కువ మంది లేక‌పోవ‌డంతో పెను ప్ర‌మాదం త‌ప్పింది. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo