బుధవారం 08 జూలై 2020
National - Jun 28, 2020 , 17:47:04

మరో లాకప్‌ డెత్‌ కోసం ఎదురుచూస్తున్నా.. ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన పోలీస్‌ సస్పెండ్

మరో లాకప్‌ డెత్‌ కోసం ఎదురుచూస్తున్నా.. ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన పోలీస్‌ సస్పెండ్

చెన్నై: మరో లాకప్‌ డెత్‌ కోసం ఎదురుచూస్తున్నా అంటూ తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్టు చేసిన ఒక పోలీ‌స్‌ అధికారిని సస్పెండ్‌ చేశారు. తమిళనాడులోని టుటికోరిన్ జిల్లాలో పోలీసుల కస్టడీలో ఉన్న తండ్రీ కొడుకులు చిత్రహింసలకు తాళలేక చనిపోయిన సంగతి తెలిసిందే. పి జయరాజ్ (59), అతని కుమారుడు జె బెన్నిక్స్ (31) ఇటీవల లాక్‌డౌన్‌ సడలింపు సమయానికి మించి తమ మొబైల్‌ షాపును తెరిచి ఉంచారు. దీంతో జూన్‌ 19న వారిద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు స్టేషన్‌కు పిలిపించి దారుణంగా కొట్టారు. ఆ చిత్రహింసలకు తాళలేక వారిద్దరు అనారోగ్యానికి గురై చికిత్స పొందుతూ ఈ నెల 22న తండ్రి, మరునాడు కుమారుడు మరణించారు. 

మరోవైపు ఈ ఘటనను ఉద్దేశించి సతీష్ ముత్తు అనే పోలీస్‌ తన ఫేస్‌బుక్‌లో వివాదస్పద పోస్టు చేశాడు. ‘తర్వాతి లాకప్‌ డెత్‌ కోసం వేచి చూస్తున్నా.. పోలీసులమైన మనకు ఆ హక్కు ఉన్నది’ అని అందులో పేర్కొన్నాడు. ఈ పోస్ట్‌పై వివాదం రావడంతో పోలీస్‌ అధికారులు సతీష్‌ను సస్పెండ్‌ చేశారు. మరోవైపు తన ఫేస్‌బుక్‌ ఖాతాలో ఎవరో దాన్ని పోస్టు చేశారని, దీనికి తాను క్షమాపణ చెబుతున్నట్లు అతడు పేర్కొన్నాడు. కాగా ఈ అంశంపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. logo