బుధవారం 01 ఏప్రిల్ 2020
National - Feb 16, 2020 , 01:07:13

ఓటరు కార్డుతో పౌరసత్వం!

ఓటరు కార్డుతో పౌరసత్వం!
  • ఆధార్‌, పాన్‌, రేషన్‌కార్డులతో కుదరదు: ముంబై స్థానిక కోర్టు

ముంబై: పౌరసత్వ నిరూపణకు ఓటరు గుర్తింపు కార్డు కూడా పనికొస్తుందని ముంబైలోని ఓ కోర్టు తెలిపింది. అయితే ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, రేషన్‌కార్డు ద్వారా పౌరసత్వం ఇవ్వలేమని పేర్కొంది. బంగ్లాదేశ్‌ నుంచి అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించి ఇక్కడే నివసిస్తున్నారన్న ఆరోపణలపై ఓ జంటపై 2017లో కేసు నమోదు కాగా.. దీనిపై విచారణ జరిపిన కోర్టు వారిని నిర్దోషులుగా ప్రకటించింది. ‘ఓ వ్యక్తి మూలాలను తెలుసుకోవడానికి జనన ధ్రువీకరణ పత్రం, స్థిర నివాసపత్రం, బోనఫైడ్‌ సర్టిఫికెట్‌, పాస్‌పోర్టులు ఉపయోగపడుతాయి. అలాగే సదరు వ్యక్తి పౌరసత్వ నిరూపణకు ఓటరు కార్డును పరిగణనలోకి తీసుకోవచ్చు. ప్రజా ప్రాతినిధ్య చట్ట ప్రకారం సదరు వ్యక్తి ఓటరు కార్డుకు దరఖాస్తు చేసుకుంటాడు. దాన్ని పరిశీలించిన తర్వాతే అధికారులు ఓటరు కార్డును జారీ చేస్తారు. కాబట్టి పౌరసత్వ నిరూపణకు అది పనికొస్తుంది’ అని కోర్టు పేర్కొంది.


logo
>>>>>>