గురువారం 02 జూలై 2020
National - Jun 22, 2020 , 14:53:30

నాన్ వెజ్ ఫుడ్ కు డిమాండ్.. తిర‌స్క‌రించినందుకు దాడి

నాన్ వెజ్ ఫుడ్ కు డిమాండ్.. తిర‌స్క‌రించినందుకు దాడి

ఢిల్లీ : దేశ రాజ‌ధాని ఢిల్లీలో క‌రోనా వైర‌స్ క‌రాళ నృత్యం చేస్తోంది. క‌రోనా పాజిటివ్ కేసుల్లో మ‌హారాష్ర్ట మొద‌టి స్థానంలో ఉండ‌గా, ఢిల్లీ రెండో స్థానంలో ఉంది. ఢిల్లీలో ఇప్ప‌టి వ‌ర‌కు 59,746 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 2,175 మంది చ‌నిపోయారు. 

అయితే ప‌శ్చిమ ఢిల్లీలోని న‌రైనా ఏరియాలో శ‌నివారం ప‌ది మందికి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. దీంతో ఆ ప్రాంతాన్ని కంటైన్ మెంట్ జోన్ గా ఢిల్లీ వైద్యాధికారులు ప్ర‌క‌టించారు. అక్క‌డ బారీకేడ్లు ఏర్పాటు చేసి.. సెక్యూరిటీ సిబ్బందిని మోహ‌రించారు. 

అదే రోజు అక్క‌డున్న స్థానికులు.. సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. బారీకేడ్ల‌ను తొల‌గించాల‌ని డిమాండ్ చేశారు. ఆదివారం రోజు కూడా గొడ‌వ చోటు చేసుకుంది. ఇప్పుడేమో త‌మ‌కు నాన్ వెజ్ ఫుడ్ ను డెలివ‌రీ చేయాల‌ని డిమాండ్ చేశారు. అత్య‌వ‌స‌రం కాని వ‌స్తువుల‌ను కూడా వారు అడిగారు. ఈ క్ర‌మంలో సెక్యూరిటీ సిబ్బంది, స్థానికుల‌కు మ‌ధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జ‌రిగింది.

స్థానికులు సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేసి తీవ్రంగా గాయ‌ప‌రిచారు.  ఈ దాడిని ఆపేందుకు ప్ర‌య‌త్నించిన ఓ పోలీసు అధికారిపై కూడా దుండ‌గులు దాడికి పాల్ప‌డ్డారు.  ఈ ఘ‌ట‌న‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.  సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల‌ను గుర్తించే ప‌నిలో ఉన్నామ‌ని పేర్కొన్నారు. 


logo