సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 17, 2020 , 13:38:36

ఆ ఆడియో టేపుల్లోవి నా మాట‌లు కావు: షెకావ‌త్‌

ఆ ఆడియో టేపుల్లోవి నా మాట‌లు కావు: షెకావ‌త్‌

జైపూర్‌: రాజ‌స్థాన్‌లో అశోక్‌ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చడానికి కేంద్రమంత్రి, బీజేపీ నేత‌ గజేంద్రసింగ్ షెకావ‌త్  ప్రయత్నించారంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను ఆయ‌న ఖండించారు. కాంగ్రెస్ అస‌త్య‌పు ఆరోప‌ణ‌లు చేస్తున్న‌ద‌ని మండిప‌డ్డారు. కాంగ్రెస్ త‌న‌విగా చెబుతున్న ఆడియో టేపులు త‌ప్పుడువ‌ని, వాటిలో ఉన్నవి తన మాటలు కాద‌ని చెప్పారు. ఈ విషయంలో ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని షెకావ‌త్ ప్రకటించారు.

కాగా, రాజ‌స్థాన్‌ కాంగ్రెస్‌ను చీల్చేందుకు కుట్రచేసిన గజేంద్రసింగ్ షెకావత్‌పై కేసు నమోదుచేసి, అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా డిమాండ్ చేశారు. ఆ ఆడియో టేపులను ఆధారంగా చేసుకునే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భన్వర్‌లాల్ శర్మ, విశ్వేంద్రసింగ్‌ను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించామని సుర్జేవాలా తెలిపారు. మరోవైపు షెకావత్‌పై కాంగ్రెస్ చీఫ్ విప్ మహేశ్ జోషి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో కాంగ్రెస్ ఎమ్మెల్యేలైన భన్వర్‌లాల్‌ శర్మ, విశ్వేంద్రసింగ్‌ల‌ను ప్ర‌తివాదులుగా పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo