సోమవారం 23 నవంబర్ 2020
National - Nov 20, 2020 , 01:54:21

పది కోట్ల జరిమానా చెల్లించిన శశికళ

పది కోట్ల జరిమానా చెల్లించిన శశికళ

చెన్నై: అవినీతి, అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న తమిళనాడు మాజీ సీఎం జయలలిత సన్నిహితురాలు శశికళ, బెంగళూరు సిటీ సివిల్‌ కోర్టుకు పది కోట్ల జరిమానా చెల్లించారు. దీంతో విడుదల తేదీ అయిన వచ్చే ఏడాది జనవరి 27కు ముందుగానే సత్ప్రవర్తన కింద ఆమె జైలు నుంచి బయటకు వచ్చే అవకాశమున్నదని శశికళ తరుఫు న్యాయవాది తెలిపారు. మరోవైపు శశికళ విడుదలతో ఏఐఏడీఎంకేలో ఎలాంటి మార్పు ఉండదని సీఎం కే పళనిస్వామి చెప్పారు. శశికళతోపాటు ఆమె కుటుంబ సభ్యులను పార్టీకి దూరంగానే ఉంచుతామన్నారు.