మంగళవారం 31 మార్చి 2020
National - Mar 24, 2020 , 16:47:28

విశాఖపట్నంలో మూడు కరోనా కేసులు !

విశాఖపట్నంలో మూడు కరోనా కేసులు !

ఆంధ్రప్రదేశ్‌ విశాఖపట్నం జిల్లాలో 3 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని తెలిపారు. కరోనా నియంత్రణపై మంత్రి మంగళవారం సమీక్ష జరిపారు. కరోనా నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వైరస్‌ నియంత్రణకు ప్రజలు సామాజిక దూరం పాటించాల్సిందేనని సూచించారు. ప్రజలకు ఎన్ని పనులు ఉన్నా ఇంట్లోనే ఉండాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాలను కచ్చితంగా పాటించాలని పేర్కొన్నారు. కరోనా నియంత్రణకు అధికారుల కృషి అభినందనీయమని కొనియాడారు. కరోనా నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం ఇంకా కావాలని పిలుపునిచ్చారు. కరోనా నియంత్రణకు 20 కమిటీలు నియమించామని ఆళ్లనాని చెప్పారు. విదేశాల నుంచి వచ్చినవారు స్వచ్చందంగా రిపోర్ట్‌ చేయాలన్నారు. నిబంధనలు పాటించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆళ్లనాని హెచ్చరించారు.logo
>>>>>>