గురువారం 04 జూన్ 2020
National - May 07, 2020 , 15:59:21

శ్రామిక్‌ రైళ్లపై విశాఖ గ్యాస్‌ లీక్‌ ప్రభావం

శ్రామిక్‌ రైళ్లపై విశాఖ గ్యాస్‌ లీక్‌ ప్రభావం

అమరావతి : ఏపీ నుంచి బయల్దేరే శ్రామిక్‌ రైళ్ల రాకపోకలపై విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటన ప్రభావం పడింది. సింహాచలం నార్త్‌ స్టేషన్‌లో 9 శ్రామిక్‌ రైళ్లు నిలిచిపోయాయి. శ్రామిక్‌ రైళ్లు వలస కూలీలను తీసుకుని ఆయా రాష్ర్టాలకు వెళ్తున్నాయి. విశాఖపట్నం.. గోపాలపట్నం పరిధి ఆర్‌ఆర్‌ వెంకటాపురంలోని ఎల్‌జీ పాలీమర్స్‌ కంపెనీలో ఈ తెల్లవారుజామున గ్యాస్‌ లీకైన విషయం తెలిసిందే. ఈ విష వాయువు దాటికి ఇప్పటికే 10 మంది చనిపోగా వందల సంఖ్యలో అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా వలస కూలీలతో ఈ ప్రాంతం గుండా వెళ్లాల్సిన పలు శ్రామిక్‌ రైళ్లపై గ్యాస్‌ లీకేజీ ప్రభావం పడింది.


logo