ఆదివారం 24 జనవరి 2021
National - Jan 12, 2021 , 17:01:39

హాట్ కేకుల్లా విరుష్క‌, మోదీ ప‌తంగులు

హాట్ కేకుల్లా విరుష్క‌, మోదీ ప‌తంగులు

రాజ్‌కోట్‌: గుజ‌రాత్‌లో ప్ర‌తిఏటా నిర్వ‌హించే ఉత్త‌రాయ‌ణ ఫెస్టివ‌ల్ సంద‌ర్భంగా టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ-అనుష్క శ‌ర్మ జోడీ, ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ, కొవిడ్‌-19 థీమ్స్‌, క్రికెట‌ర్లు, సినీ న‌టుల ఫొటోలు ఉన్న ప‌తంగులు హాట్ కేకుల్లా అమ్ముడు అవుతున్నాయి. ఈ ఏడాది 1500 ర‌కాల మోడ‌ళ్ల ప‌తంగులు మార్కెట్లో ఉన్నాయి. ప్ర‌తి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ప్ర‌ధాని మోదీ ఫొటోగ్రాఫ్‌ల‌తో కూడిన ప‌తంగుల‌కు గిరాకీ ఉంది. క‌రోనా వైర‌స్ థీమ్‌తో త‌యారు చేసిన పతంగుల‌కు అత్య‌ధిక డిమాండ్ నెల‌కొందని ర‌జినీ ప‌టేల్ అనే షాప్ కీప‌ర్ చెప్పారు. 

మోదీ హై టూ మ‌మ్‌కిన్ హై, వేర్ ఏ మాస్క్ టూ బీట్ క‌రోనా వైర‌స్‌, సినీ న‌టి అనుష్క శ‌ర్మ‌-క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ దంప‌తుల ఫోటో, యానిమేటెడ్ క్యారెక్ట‌ర్లు, సూప‌ర్ హీరోల ఫొటోల‌తోపాటు విభిన్న మెసేజ్‌లు ప్రింట్ చేసిన ప‌తంగులు రాజ్‌కోట్ ప‌తంగుల మార్కెట్‌లో ద‌ర్శ‌నం ఇచ్చాయి. 

ఉత్త‌రాయ‌ణ్ ఫెస్టివ‌ల్ కోసం ప‌తంగులు కొనుగోలు చేయ‌డానికి వ‌చ్చిన ఓ క‌స్ట‌మ‌ర్ మాట్లాడుతూ క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల్ల మ‌న‌మంతా ఇళ్ల‌కు ప‌రిమిత‌మైన నేప‌థ్యంలో సంక్రాంతి పండుగ ఉత్త‌మ‌మైన వేడుక‌ని భావిస్తాన‌న్నారు. కానీ పండుగ జ‌రుపుకోవ‌డానికి ప్ర‌భుత్వం అనుమ‌తించింద‌ని, త‌న వంటి వారికి చాలా ఎక్సైటింగ్‌గా ఉంద‌ని చెప్పారు. 

గుజ‌రాత్ ప్ర‌తియేటా ఉత్త‌రాయ‌ణ్ పండుగ జ‌రుపుకుంటుంది. ఈ సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 14న పతంగుల పండుగ‌గా ఈ పండుగ ప్ర‌జాద‌ర‌ణ పొందింది. శీతాకాలం నుంచి వేస‌వికి ప‌రివ‌ర్త‌న‌కు సంకేతంగా ఉత్త‌రాయ‌ణ్ పండుగ జ‌రుపుకుంటారు. ఈ పండుగ‌ను సూర్య భ‌గ‌వానుడికి అంకితం చేస్తారు. ఆరోగ్య‌క‌రంగా, సంప‌న్నంగా ఉండాల‌ని కోరుకుంటారు. ఇది పంట‌ల కోత కాలం ప్రారంభానికి సంకేతం అని తెలిపారు. 

గుజ‌రాత్‌లోని ప‌లు న‌గ‌రాలు కైట్ ఫెస్టివ‌ల్ సంద‌ర్భంగా పోటీలు నిర్వ‌హిస్తాయి. వివిధ దేశాల నుంచి వ‌చ్చే ప్ర‌ముఖులు, సంద‌ర్శ‌కుల‌ను అహ్మ‌దాబాద్‌లో నిర్వ‌హించే అంత‌ర్జాతీయ కైట్ ఫెస్టివ‌ల్‌లో అనుమ‌తినిస్తారు. ఈ ఏడాది క‌రోనా నేప‌థ్యంలో కైట్ ఫెస్టివ‌ల్ ఇళ్ల‌లోనే జ‌రుపుకోవాల‌ని ఆదేశిస్తూ గుజ‌రాత్ ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీన్ని రాష్ట్ర హైకోర్టు కూడా ధ్రువీక‌రించింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo