గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 24, 2020 , 12:31:25

ట్ర‌క్కు త‌గ‌ల‌డంతో హెలికాఫ్ట‌ర్ రెక్కలు ముక్క‌ల‌య్యాయి : వీడియో వైర‌ల్‌

ట్ర‌క్కు త‌గ‌ల‌డంతో హెలికాఫ్ట‌ర్ రెక్కలు ముక్క‌ల‌య్యాయి :  వీడియో వైర‌ల్‌

ప్ర‌మాదం జ‌ర‌గ‌క‌ముందు హా.. ఏం చేస్త‌దిలే అని మాట‌లు చెబుతారు. జ‌రిగిన త‌ర్వాత అలా అవుతుంద‌ని అస‌లు అనుకోలేదంటారు. ఎక్క‌డో గాల్లో ఎగ‌రాల్సిన హెలికాఫ్ట‌ర్ ఇలా రోడ్డు మీద స‌రిగ్గా యూ ట‌ర్న్ తీసుకునే చోట వ‌‌చ్చి వాలింది. అప్పుడే దిగిన‌ట్టుంది రెక్క‌లు మాత్రం తిరుగుతున్నాయి. అయితే అటుగా వెళ్తున్న వాహ‌నాలు మాత్రం ఆగ‌కుండా వాటి దారిన అవి వెళ్తున్నాయి.

కాక‌పోతే ఒక ట్ర‌క్కు అక్క‌డ యూ ట‌ర్న్ అవుతున్న‌ది. పొడ‌వైన‌ రెక్క‌లు త‌గ‌ల‌వులే అని ట‌ర్నింగ్ తిప్పుడుతున్నాడు. ఇంకేముంది ట్ర‌క్కు చివ‌రి భాగం హెలికాఫ్ట‌ర్ రెక్క‌ల‌కు త‌గిల‌డంతో రెక్క‌లు కాస్త ముక్క‌ల‌య్యాయి. ఇక ట్ర‌క్కు విష‌యం చెప్ప‌న‌వ‌స‌రం లేదు. నిర్ల‌క్ష్యం కార‌ణంగానే ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ముందుగా హెలికాఫ్ట‌ర్ అక్క‌డ దిగ‌కూడ‌దు. ఇక‌పోతే ఆ ట్ర‌క్కు కూడా త‌గల‌దులే అనే ధీమాతో వెళ్ల‌కూడ‌దు. చిన్న పొర‌పాటు వ‌ల‌న ఈ ఘోరం జ‌రిగింది. ఇప్పుడు ఈ వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా తెగ వైర‌ల్ అవుతున్న‌ది. logo