గురువారం 06 ఆగస్టు 2020
National - Jul 29, 2020 , 11:57:27

దొంగ‌త‌నానికి వ‌చ్చిన దొంగ‌లే య‌జ‌మానిని కాపాడారు.. గ్రేట్ దొంగ‌లు!

దొంగ‌త‌నానికి వ‌చ్చిన దొంగ‌లే య‌జ‌మానిని కాపాడారు.. గ్రేట్ దొంగ‌లు!

రియ‌ల్‌గా జ‌రిగే దొంగ‌త‌నాలంటే చాలామందికి భ‌యం. కానీ సినిమాల్లో జ‌రిగే దొంగ‌త‌నాల్ని మాత్రం ఇష్ట‌ప‌డుతారు. ఉదాహ‌ర‌ణ‌కు రాజా ది గ్రేట్ సినిమాలో రాజేంద్ర‌ప్రశాద్‌ కోసం జ‌రిగే దోపిడి భ‌లే స‌ర‌దాగా ఉంటుంది క‌దా. అచ్చం అలాగే రియ‌ల్ దోపిడి జ‌రిగింది. కాక‌పోతే ఇక్క‌డ‌ ఎలాంటి వ‌స్తువులు పోలేదు. ఇద్ద‌రు దొంగ‌లు ప‌క్కా ప్లాన్‌తో స్టోర్‌లోకి ఎంట‌ర్ అయ్యారు. ఒక‌డు య‌జ‌మాని దృష్టి మ‌ళ్లించాడు. మ‌రో వ్య‌క్తి ఏమో లోప‌లికి వెళ్లి తీసుకొచ్చిన బ్యాగ్‌లో వ‌స్తువుల‌న్నింటినీ సర్దేస్తున్నాడు. క్లైమాక్స్‌లో మ‌రో దొంగ గ‌న్ ప‌ట్టుకొని స్టోర్ య‌జ‌మాన్ని బెదిరిస్తున్నాడు.

విష‌యం ఏంటంటే. మూడో వ్య‌క్తికి వీళ్ల‌కి ఎలాంటి సంబంధం లేదు. త‌మ‌ని తాము ర‌క్షించుకునేందుక‌కు  అప్ప‌టిక‌ప్పుడే మాస్ట‌ర్ ప్లాన్ వేశారు మొద‌టి ఇద్ద‌రు దొంగ‌లు. ఒక దొంగ తన చేతిలోని రోలర్‌ను వేసి దుండగుడి దృష్టి మరల్చగానే మరో దొంగ అతడిపై దాడి చేసి గన్ లాక్కున్నాడు. అనంతరం ఆ దుండగుడిపై వస్తువులు పడేసి.. స్టోర్ యజమాని చేతిలో గన్ పెట్టేసి బయటకు పరిగెట్టారు. వీరిద్ద‌రు క్షేమంగా బ‌య‌ట ప‌డ‌డ‌మే కాకుండా మ‌జ‌మానిని కూడా కాపాడారు. ఎంతైనా గ్రేట్ దొంగ‌లు క‌దా. అందుకే ఈ వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్న‌ది. logo