తన ఉద్యమం తెలంగాణ తల్లి పడ్డ పురిటినొప్పులైతే
ఆ నొప్పుల సందేశం తెలంగాణ ఉద్యమపోరు
కోట్లమంది తెలంగాణ ప్రజల కలల
ఆయుష్షు పోసుకొని వచ్చిన ఆత్మబంధువు కేసీఆర్..
గుప్పెడు మందితో తెలంగాణ ఉద్యమాన్ని
జలదృశ్యంలో మొదలుపెట్టాడు కేసీఆర్..
నాడు ఎవరూ అనుకోలేదు తెలంగాణ కల సాకారం చేస్తాడని కేసీఆర్..
తెలంగాణ ఉద్యమంలో పదవులను పదేపదే
తృణప్రాయంగా వదిలేశాడు కేసీఆర్..
దాయాదుల కుట్రలు ఎప్పటికప్పుడు పటాపంచలు చేశాడు కేసీఆర్..
నిరాహారదీక్షతో చావు నోట్లో తలపెట్టాడు కేసీఆర్..
ఊరురూను కదిలించి ఉద్యమంలో ఏకం చేశాడు కేసీఆర్..
ఢిల్లీ మెడలు వంచి అరవై ఏండ్ల తెలంగాణ కల సాకారం చేశాడు కేసీఆర్..
తెలంగాణ ప్రజల తరుపున బంగారు తెలంగాణ కలగన్నాడు కేసీఆర్..
ఆ కల నిజం చేసే విధాత అయి
అడుగులు వేశాడు కేసీఆర్..
చెమటలతో స్నానం చేసి
కన్నీటితో కడుపు నింపుకొన్నాడు కేసీఆర్..
శత్రువులకు మాటలే తూటాలుగా
వదిలాడు కేసీఆర్..
తన లక్ష్యపు బాటలో ఒక కొర్రాయిలా
మారాడు కేసీఆర్..
జై తెలంగాణ అంటూ గులాబీ
ఢంకా మోగించాడు కేసీఆర్..
చివరికి..
కాళేశ్వర సుజల దృశ్య ప్రాజెక్టుతో
తెలంగాణను కోటి ఎకరాల మాగాణి
చేశాడు కేసీఆర్..
ఏప్రిల్ 27 సందర్భంగా టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు..
తుమ్మల కల్పన రెడ్డి, 96404 62142