బుధవారం 30 సెప్టెంబర్ 2020
National - Aug 03, 2020 , 13:19:11

ఏనుగు ఆకులు తింటుంటే ఆశ్చ‌ర్యంగా చూసిన చిరుత‌.. ఇద్ద‌రూ ఫ్రెండ్సే!

ఏనుగు ఆకులు తింటుంటే ఆశ్చ‌ర్యంగా చూసిన చిరుత‌.. ఇద్ద‌రూ ఫ్రెండ్సే!

చిరుత ద‌గ్గ‌ర ఏ జంతువు ప్ర‌శాంతంగా క‌నిపించినా ఆశ్చ‌ర్య‌మే. ఏ జంతువును చూసినా ఏమ‌న‌కుండా ఉండే చిరుత‌ను చూసినా వింతే. ఇక్క‌డ చెప్పుకోబోయే విష‌యం కూడా అలాంటిదే.. ఒక పెద్ద ఏనుగు, ఒక చిరుత పులి. రెండూ ప‌క్క‌ప‌క్క‌నే ఉన్నాయి. 26 సెకండ్ల‌పాటు న‌డిచే ఈ వీడియోలో చిరుత పులి ఒక బండ‌పై కూర్చొని ఉంది.

దానికి స‌మీపంలోనే చెట్టు కొమ్మ ఆకుల‌ను ఏనుగు తింటూ ఉన్న‌ది. ఏనుగు ఆకుల్ని తింటున్నంతసేపు ఏమ‌న‌కుండా చిరుత ఆశ్చ‌ర్యంగా క‌ళ్ల‌ప్ప‌గించి చూస్తున్న‌ది. ఈ వీడియోను ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ ఆఫీస‌ర్ సుశాంత నందా ట్విట‌ర్‌లో షేర్ చేశారు. నెటిజ‌న్లు ఈ వీడియోను ఇష్ట‌ప‌డ్డారు. అంతేకాదు వారి ఆలోచ‌న‌ల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌జేస్తున్నారు. 'చిరుత‌పులి కూడా వీక్ష‌ణ‌ను ఆస్వాదిస్తోంది' అంటూ ఒక నెటిజ‌న్ కామెంట్ పెట్టారు. 

తాజావార్తలు


logo