బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 21, 2020 , 11:35:09

న‌త్త ట‌మాట‌ తింటుందా..? అది కూడా ఇంత వేగంగానా..!

న‌త్త ట‌మాట‌ తింటుందా..? అది కూడా ఇంత వేగంగానా..!

ప్ర‌పంచంలోక‌ల్లా నెమ్మ‌దిగా న‌డిచే జీవి న‌త్త అని అంద‌రికీ తెలిసిందే. ఎవ‌రైనా నిదానంగా న‌డుస్తుంటే ఏంటా న‌త్త న‌డ‌క అనే సామెత‌ను వాడుతారు. ఇది ముమ్మాటికీ నిజ‌మే. లేదంటే అలా ఎందుకు అంటారు. ఒక మీటరు దూరం వెళ్లాలంటే న‌త్త ఎంతో స‌మ‌యం తీసుకుంటుంది. మ‌రి న‌త్త ఆహారం తినాలంటే.. అది కూడా అంతే! నిదాన‌మే ప్రదానం అన్న‌ట్లు తింటుంది. 

ఉదాహ‌ర‌ణ‌కు ఈ వీడియోలో చూసిన‌ట్ల‌యితే న‌త్త ట‌మాట తింటున్న‌ది. మ‌నుషులు, జంతువుల క‌న్నా వేగంగా తింటున్న‌ది. ఇది నిజం కాదు. మామూలుగా న‌త్త ఒక ట‌మాట ముక్క‌ను తినాలంటే మినిమ‌మ్ 12 గంట‌ల స‌మ‌యం ప‌డుతుంది. అంత‌సేపు న‌త్త ఓపిగ్గా తిన‌గ‌ల‌దు కానీ, చూసే ఓపిక మ‌న‌కు ఉండ‌దు క‌దా. అందుక‌ని టైమ్స్ లాప్స్‌లో వీడియో ద్వారా చిత్రీక‌రించారు. అందుకే అంత వేగంగా తిన‌గ‌లిగింది. ఏదేమైనా న‌త్త మ‌నిషిక‌న్నా ఎంతో శుభ్రంగా ఒక ముక్క కూడా వ‌ద‌ల‌కుండా తినేసింది. అందుకే నిదానం అయినా చేసే ప‌ని శుభ్రంగా ఉండాలి అంటారు. ఈ వీడియో చూస్తే మీరు కూడా శుభ్రంగా ఉండాల‌నుకుంటారు. 


 


logo