శనివారం 08 ఆగస్టు 2020
National - Jul 27, 2020 , 20:42:28

ఆమె బెల్జియంలో రిసెర్చ్ అవ‌కాశం వ‌దులుకుంద‌ట‌!

ఆమె బెల్జియంలో రిసెర్చ్ అవ‌కాశం వ‌దులుకుంద‌ట‌!

భోపాల్‌: ‌రైజా అన్సారీ! ఈ పేరు గ‌త వారం దేశంలోని అన్ని పేప‌ర్లు, ఛానెళ్లు, వెబ్‌సైట్ల‌లో మారుమోగింది. పీహెచ్‌డీ చ‌దివినా ఏ ఉద్యోగం దొర‌క‌క‌పోవ‌డంతో ఇండోర్‌లోని ఓ మార్కెట్లో తోపుడు బండిపై పండ్లు, కూర‌గాయ‌లు అమ్ముకుంటున్న రైజా.. గ‌త వారం రోడ్ల‌పై తోపుడు బండ్ల‌ను తొల‌గిస్తున్న అధికారుల‌పై ఆంగ్ల‌భాష‌లో విరుచుకుప‌డింది. మాటిమాటికి లాక్‌డౌన్ అంటూ త‌మ వ్యాపారాల‌పై దెబ్బకొడితే ఎలా బ‌తుకాలంటూ నిల‌దీసింది. 

అయితే, పండ్లు, కూర‌గాయ‌లు అమ్ముకునే మ‌హిళ ఫ్లుయెంట్ ఇంగ్లిష్‌లో అధికారుల‌ను నిల‌దీయడంతో ఆ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో మీడియాలో వైర‌ల్ అయ్యింది. పీహెచ్‌డీ చ‌దివి పండ్ల వ్యాపారం చేయ‌డానికి కార‌ణం ఏమిట‌ని మీడియా అడిగితే ఆమె ప‌లు ఆస‌క్తిక‌ర స‌మాధానాలు చెప్పింది. త‌న కుటుంబంలో త‌ల్లితండ్రి, ముగ్గురు సోద‌రులు, వారి ఎనిమిది మంది పిల్ల‌లు క‌లిపి మొత్తం 25 మందిమి ఉంటామ‌ని వెల్ల‌డించింది. 

పిల్ల‌లు చిన్న‌వ‌య‌సులో ఉండ‌గానే త‌మ సోద‌రుల భార్య‌లు వారిని విడిచిపెట్టి వెళ్లిపోయార‌ని, అప్ప‌టి నుంచి తాను వారి ఆల‌నాపాల‌నా చూసుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని, అందువ‌ల్ల ఉద్యోగం చూసుకునే అవ‌కాశం లేకుండా పోయింద‌ని రైజా తెలిపింది. తాను అహ‌ల్య యూనివ‌ర్సిటీలో పీహెచ్‌డీ చ‌దువుతున్న స‌మ‌యంలో బెల్జియంలోని ఒక యూనివ‌ర్సిటీ రిసెర్చ్ ప్రాజెక్టు ఆఫ‌ర్ చేసింద‌ని, అయితే త‌న పీహెచ్‌డీ గైడ్ అందుకు ఒప్పుకోక‌పోవ‌డంతో ఆ అవ‌కాశం చేజారిపోయింద‌ని రైజా చెప్పారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo