శనివారం 11 జూలై 2020
National - Jun 19, 2020 , 15:40:16

కొల‌నులో జ‌ల‌కాలాడుతున్న శున‌కం! వ‌ద్ద‌నుకుంటూనే ఓన‌ర్‌..

కొల‌నులో జ‌ల‌కాలాడుతున్న శున‌కం! వ‌ద్ద‌నుకుంటూనే ఓన‌ర్‌..

కొల‌నులోని నీటితో  ఆటాడుతున్న పెంపుడు కుక్క‌ను బ‌య‌ట‌కు తీసుకోవ‌రావ‌డానికి ఓన‌ర్‌కు మ‌న‌సు ఒప్ప‌లేదు. బ‌ల‌వంతంగా బ‌య‌ట‌కు తీసుకువ‌స్తున్న వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ది. 'మ‌నిషి అయిష్టంగానే కొల‌నులోకి వెళ్తున్నాడు' అనే శీర్షిక‌తో ఈ వీడియోను డిగ్ కింగ్ స్మిత్ హెచ్‌క్యు అనే యూజ‌ర్ ట్విట‌ర్‌లో షేర్ చేశాడు. 

ఈ వీడియోను ఒక పార్క్‌లో రికార్డ్ చేసిన‌ట్లు అనిపిస్తుంది. ఫ‌న్నీగా ట్వీట్ చేసిన ఈ వీడియోకి 1.7 మిలియన్ల మంది వీక్షించ‌డం గ‌మ‌నార్హం. 44 సెకండ్ల‌పాటు న‌డిచే ఈ వీడియోలో య‌జ‌మాని అయిష్టంగా కొల‌నులోకి దిగుతుండ‌డం నుంచి ప్రారంభ‌మ‌వుతుంది. కుక్క ఎంత ఎన‌ర్జీగా ఆడుతుందో య‌జ‌మాని అంత నీర‌సంగా ఉన్నాడు. కొల‌నులోని నీటి ఫౌంటెన్ వ‌ద్ద కుక్క ఎంజాయ్ చేయ‌డం వీడియోలో చూడొచ్చు. త‌న‌తోపాటు య‌జ‌మానికి కూడా కొంత‌వ‌ర‌కు నీటితో త‌డిపింది శునకం. వీరిద్ద‌రి ఆట అంద‌రినీ ఉత్సాహ‌ప‌రుస్తుంది అని నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. 


logo