బుధవారం 21 అక్టోబర్ 2020
National - Sep 17, 2020 , 15:51:24

అత‌ని సంగీతానికి.. 'ఆవు' కూడా స్వ‌రం క‌లిపింది!

అత‌ని సంగీతానికి.. 'ఆవు' కూడా స్వ‌రం క‌లిపింది!

సాధార‌ణంగా కోయిల రాగాలు తీస్తున్న‌ప్పుడు మ‌నం కూడా అరిస్తే అవి మ‌రింత ఉత్సాహంగా అరుస్తాయి. అలా కోయిల‌ స్వ‌రం వింటుంటే మ‌ళ్లీ మ‌ళ్లీ వినాల‌నిపిస్తుంది. వీటిలా గోవులు కూడా రాగాలు తీస్తాయ‌ని తెలుసా? ఎప్పుడైనా విన్నారా?  మ‌నం ఒక‌సారి పాడ‌మ‌ని అడ‌గాలే గాని మ‌న‌తోపాటు స్వ‌రం కలుపుతాయి గోవులు.

ఓ వ‌యోలిన్ ఆర్టిస్ట్ ఆవు ద‌గ్గ‌ర నిల్చుని వ‌యోలిన్ ప్లే చేస్తున్నాడు. అది కూడా ఆవుకు అర్థ‌మ‌య్యే రీతిలో సంగీతం ప్లే చేస్తున్నాడు. ఆ సంగీత శ‌బ్దానికి గోవుకు కూడా పాడాల‌నిపిచ్చింది. మ్యూజిక్ ఎలా అయితే వ‌స్తుందో అచ్చం అలానే గోవు కూడా అరిచింది. ఇంకేముంది దీంతో ఆ ఆర్టిస్ట్ పంట పండిన‌ట్లే. ఆనందంతో గంతులేశాడు. వీరిద్ద‌రి సంగీతం అంద‌రికీ తెలియ‌జేసేందుకు వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్త వైర‌ల్ అయింది. 'ఆవుకు మంచి భ‌విష్య‌త్తు ఉందంటూ' నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.logo