శుక్రవారం 22 జనవరి 2021
National - Dec 03, 2020 , 17:03:44

బురేవి ఎఫెక్ట్‌ : కొడైకెనాల్‌లో భారీ ఈదురుగాలులు, వర్షం

బురేవి ఎఫెక్ట్‌ : కొడైకెనాల్‌లో భారీ ఈదురుగాలులు, వర్షం

చెన్నై : బురేవి తుపాన్‌ భారత ద్వీపకల్ప ప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గురువారం మధ్యాహ్నం నుంచి తమిళనాడులోని దిండిగుల్‌ జిల్లా కొడైకెనాల్‌లో తీవ్ర ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. సహాయ చర్యల్లో అధికారులకు తోడ్పాటు అందించేందుకు భారత నావికా దళానికి చెందిన గజఈతగాళ్లు, విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగాయి.

దక్షిణతీరంలోని జాలర్లను హెచ్చరించేందుకు, విపత్తు సహాయ చర్యలు చేపట్టేందుకు భారత నావికా దళానికి చెందిన రెండు ఓడలు, నాలుగు నేవి ఎయిర్‌ క్రాప్ట్‌లను మోహరించారు. తుపాన్‌ రామేశ్వరం తీరాన్ని దాటే సమయంలో భారీ ఈదురుగాలులకు జాలర్ల పడవలు పూర్తిగా ధ్వసమయ్యాయని అధికారులు తెలిపారు. తుపాన్‌ కారణంగా పంబన్‌ తీరంలో చిక్కుకుపోయిన ముగ్గురు జాలర్లను రక్షించారు. తమిళనాడులోని పంబన్‌-కన్యాకుమారి మధ్య గురువారం సాయంత్రం లేదా రాత్రి తుపాన్‌ తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo